BIKKI NEWS (SEP. 23) : India won two gold medals in chess Olympiad 2024. ఒలింపిక్స్ తరహాలో జరిగే ఫిడె చెస్ ఒలింపియాడ్‌లో భారత్ పురుషుల మరియు మహిళల విభాగంలో స్వర్ణ పతకాలు గెలుచుకుంది. బుడాపెస్ట్ వేదికగా జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్‌లో అబ్బాయిలు స్వర్ణంతో చరిత్ర సృష్టించిన కాసేపటికే అమ్మాయిల బృందం కూడా పసిడితో రికార్డు నెలకొల్పింది.
India won two gold medals in chess Olympiad 2024
ద్రోణవల్లి హారిక, ఆర్. వైశాలి. దివ్యా దేశ్‌ముఖ్, వంతికా అగర్వాల్, తానియా సచ్‌దేవ్ బృందం చెస్ ఒలింపియాడ్‌లో పసిడితో నవశకానికి నాంది పలికింది. 44వ ఒలింపియాడ్‌లో కాంస్యానికే పరిమితమైన అమ్మాయిలు ఈసారి సంచలన ఆటతో పసిడి వెలుగులు విరజిమ్మారు.
టోర్నీ ఆసాంతం గుకేశ్‌తో పాటు అర్జున్ ఎరిగేసి, ఆర్ ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీ, పీ హరికృష్ణ, శ్రీనాథ్ నారాయణన్(కెప్టెన్)లతో కూడిన బృందం అద్భుతంగా రాణించింది. రెండేండ్లకు ఓ సారి జరిగే ఈ టోర్నీలో 2022 లోకాంస్యంతో సరిపెట్టుకున్న భారత్‌కు ఈసారి స్వర్ణం దక్కడం గమనార్హం.