BIKKI NEWS (NOV. 08) : Implementing of job calendar and fill 2 lakhs jobs. తెలంగాణ రాష్ట్రంలో తమ ఎన్నికల హమీ ప్రకారం జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని, తద్వారా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.
Implementing of job calendar and fill 2 lakhs jobs
ఇప్పటికే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని త్వరలోనే మరిన్ని నోటిఫికేషన్ల ద్వారా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు.
యూపీఎస్సీ మెయిన్స్ కు ఎంపికైన వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.
విజయవంతంగా గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించామని, త్వరలోనే గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.