BIKKI NEWS (JAN. 24) : ICC AWARDS 2023 WINNERS LIST – 2023 సంవత్సరానికి గాను ఐసీసీ అవార్డులను ప్రకటించింది. న్యూజిలాండ్ యువ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రకు ప్రతిష్టాత్మక ‘ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, దక్షిణాఫ్రికా పేస్ సంచలనం గెరాల్డ్ కొయెట్జ్, శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంక లను కాదని రవీంద్రకు ఈ అవార్డు దక్కింది.
వన్డే వరల్డ్ కప్‌లో రవీంద్ర.. 578 పరుగులు చేశాడు. గతేడాది వన్డేలలో రవీంద్ర.. 820 పరుగులు చేయగా అందులో అగ్రభాగం ప్రపంచకప్‌లో చేసినవే కావడం విశేషం. అంతేగాక బౌలర్‌గా కూడా రవీంద్ర 18 వికెట్లు తీశాడు. మ
మహిళల జాబితాలో ఈ అవార్డు ఆస్ట్రేలియా యువ క్రికెటర్, 20 ఏండ్ల ఫోబె లిచ్‌ఫీల్డ్‌కు దక్కింది. గతేడాది లిచ్‌ఫీల్డ్.. టెస్టులలో 87, వన్డేలలో 344, టీ20లలో 88 పరుగులు చేసింది.
ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ కెప్టెన్ – ప్యాట్ కమిన్స్ (రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ లకు చోటు)
ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ కెప్టెన్ – రోహిత్ శర్మ (కోహ్లీ, గిల్, సిరాజ్, షమీ, కుల్దీప్ యాదవ్ లకు చోటు)
ఐసీసీ మెన్స్ టీట్వంటీ టీమ్ కెప్టెన్ – సూర్య కుమార్ యాదవ్ (యశస్వీ జైశ్వాల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ లకు చోటు)
ఐసీసీ ఉమెన్స్ వన్డే టీమ్ కెప్టెన్ – చామరి ఆటపట్టు
ఐసీసీ ఉమెన్స్ టీట్వంటీ టీమ్ కెప్టెన్ – చామరి ఆటపట్టు (దీప్తిశర్మ కు చోటు)
ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ – బాస్ డు లీడే (నెదర్లాండ్స్)
ఐసీసీ ఉమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ – క్వింటర్ అబెల్ (కెన్యా)
ఐసీసీ మెన్స్ టీట్వంటీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ – సూర్య కుమార్ యాదవ్
ఐసీసీ ఉమెన్స్ టీట్వంటీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ – మాథ్యూస్ (వెస్టిండీస్)