BIKKI NEWS : మానవ శరీరం హర్మోన్స్, గ్రంధులు (human glands and harmones their functions) ల పూర్తి జాబితా ను పోటీ పరీక్షల నేపథ్యంలో చూద్దాం..
1) థైరాయిడ్ గ్రంథి :-
స్థానం :- గొంతు వద్ద వాయు నాళాన్ని ఆనుకుని
ఉత్పత్తి చేసే హర్మోన్ :- థైరాక్సిన్, T3, T4, PTH, కాల్సిటోనిన్
లోపిస్తే వచ్చే వ్యాధులు :- గాయిటర్, క్రెటినిజం, మిక్సేడెమా
విశేషాలు :- థైరాక్సిన్ లో అయోడిన్ అనే మూలకం ఉంటుంది. ఇది లోపిస్తే గొంతు కింద వాపు వస్తుంది. దీన్ని గాయిటర్ వ్యాధి అంటారు. యుక్తవయస్సు వారిలో ఈ హార్మోన్ లోపిస్తే క్రెటినిజం, పెద్ద వయసులో లోపిస్తే మిక్సేడెమా అనే వ్యాధులు వస్తాయి.
2) పిట్యూటరీ గ్రంథి (పియూష గ్రంథి, మాస్టర్ గ్లాండ్) :-
స్థానం :- మెదడు కింద బాగంలో
ఉత్పత్తి చేసే హర్మోన్ :- దాదాపు 10 హర్మోన్ లను (GH, TSH, ACTH, FSH, MSH, LH, PROLACTIN, OXYTOCIN, VASOPRESSIN)
లోపిస్తే వచ్చే వ్యాధి :- మరుగుజ్జుతనం
విశేషాలు :- ఈ గ్రంధి సరిగా పని చేయకపోతే మరుగుజ్జుతనం ఏర్పడుతుంది ఈ గ్రంధి దాదాపు పది హార్మోన్లను స్రవిస్తుంది. అందుకే దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు.
3) అడ్రినల్ గ్రంధి (అథివృక్క గ్రంథి) :-
స్థానం :- మూత్ర పిండాలపై
ఉత్పత్తి చేసే హర్మోన్ :- ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్, అండ్రోజన్స్, గ్లూకోకార్టికాయిడ్స్)
విశేషాలు :- కోపం, ఒత్తిడి, భయానికి గురి అయినప్పుడు ఎడ్రినలిన్ విడుదల అవుతుంది. ఫలితంగా హృదయ స్పందన పెరిగి రక్తసరఫరా రేటు అధికమవుతుంది.
4) పారాథైరాయిడ్ గ్రంథి :-
స్థానం :- థైరాయిడ్ గ్రంధి వద్ద
ఉత్పత్తి చేసే హర్మోన్ :- పారాథార్మోన్
విశేషాలు :- ఎముకల వృద్ధికి ఈ గ్రంధి అవసరం.
5) క్లోమ గ్రంథి :-
స్థానం :- జీర్ణాశయం కింద
ఉత్పత్తి చేసే హర్మోన్ :- ఇన్సులిన్
విశేషాలు :- ఇన్సులిన్ శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది ఇది సక్రమంగా విడుదల కాకుంటే మధుమేహం (షుగర్) వ్యాధి వస్తుంది.
6) ఫీనల్ గ్రంథి :-
ఉత్పత్తి చేసే హర్మోన్ :- మెలటోనిన్
7) హైపోథాలమస్ :-
ఉత్పత్తి చేసే హర్మోన్ :- డోపమైన్, సొమాటోస్టాటిన్, వాసోప్రెసిన్, CRH, TRH, GHRH
8) థైమస్ గ్రంథి :-
ఉత్పత్తి చేసే హర్మోన్ :- థైమోపోయిటిన్
9) జీర్ణాశయం :-
ఉత్పత్తి చేసే హర్మోన్ :- గ్యాస్ట్రిన్, హిస్టమిన్, సొమాటోస్టాటిన్, గ్రీలిన్, న్యూరోపెప్టైడ్ Y
10) అండాశయం ప్లాసెంటా :-
ఉత్పత్తి చేసే హర్మోన్ :- ఈస్ట్రోజెన్, ప్రొజిస్టిరాన్
11) యూటిరస్ :-
ఉత్పత్తి చేసే హర్మోన్ :- ప్రొలాక్టిన్, రిలాక్సిన్
12) టెస్టిస్ :-
ఉత్పత్తి చేసే హర్మోన్ :- అండ్రోజన్స్, ఈస్ట్రాడల్, ఇన్‌హిబిన్
13) మూత్రపిండాలు :-
ఉత్పత్తి చేసే హర్మోన్ :- కాల్సిట్రాల్, రెనిన్, ఎరిత్రొపొయిటన్