BIKKI NEWS (JUNE 23) : HORTICULTURE DIPLOMS COURSES ADMISSIONS 2024 IN SKLTSHU. ఉద్యానవన డిప్లొమా సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో ఉన్న కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రెండు సంవత్సరాల ఈ కోర్సులో 200 సీట్లు ఉన్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా రామగిరి ఖిల్లా, కొల్లాపూర్‌లలోని ప్రభుత్వ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల్లో, సూర్యాపేట గడ్డిపల్లిలోని గంటా గోపాలరెడ్డి, మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లోని విశ్వధార ప్రైవేటు ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల్లో 40 చొప్పున సీట్లు ఉన్నాయి.
HORTICULTURE DIPLOMS COURSES ADMISSIONS 2024
దరఖాస్తు ఫీజు : 1100/- (SC, ST, PH – 600/- రూపాయలు)
దరఖాస్తు విధానం : కింద ఇవ్వబడిన లింకు లోని ఫామ్ – 1 ను డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు పూరించి, కింద ఇవ్వబడిన అడ్రస్ కు పంపించవలసి ఉంటుంది.
అర్హతలు : పదో తరగతి ఉత్తీర్ణులైన లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన లేదా పాలీసెట్ 2024 పరీక్ష రాసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి : దరఖాస్తుదారులకు 31.12.2024 నాటికి కనిష్ఠంగా 15 ఏళ్లు, గరిష్ఠంగా 22 ఏళ్ల వయసు ఉండాలి.
దరఖాస్తు గడువు : జులై 15 – 2024 వరకు నింపబడిన దరఖాస్తులను స్వీకరిస్తారు.
ఎంపిక విధానం : పాలీసెట్ – 2024లో వచ్చిన ర్యాంకును లేదా పదో తరగతిలో వచ్చిన మార్కులను బట్టి ప్రవేశాలు కల్పిస్తారు. మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్లు 9652456779, 8333981354 లలో సంప్రదించవచ్చు.
దరఖాస్తు పంపవలసిన చిరునామా.
The Registrar,
Sri Konda Laxman Telangana State Horticultural University,
Administration Building,
Mulugu (Vill & Mdl.), Siddipet District – 502 279,
Telangana