HIV MEDICINE : క్లినికల్ ప్రయోగాల్లో 100 శాతం ఫలితాన్నిచ్చిన ఔషధం

BIKKI NEWS (JULY 08) : HIV MEDICINE Lenacapavir. హెచ్ఐవీ నుండి రక్షణ కొరకు లెనాకాపావిర్ అనే ఇంజెక్షన్ ను ఏడాదికి రెండు సార్లు ఇస్తే యువతులకు ఈ వ్యాధి నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని దక్షిణాఫ్రికా, ఉగాండాలో నిర్వహించిన క్లినికల్ పరీక్షల్లో వెల్లడైంది.

HIV MEDICINE Lenacapavir

ప్రస్తుతం మాత్రల రూపంలో ఇస్తున్న రెండు రకాల ఔషధాల కన్నా ఇది మెరుగ్గా పనిచేస్తున్నట్లు ఈ ప్రయోగాలలో తేలింది.

హెచ్ఐవీ వైరస్ లోని జన్యు పదార్థం, ఎంజైమ్ లకు రక్షణ కల్పించే ఒక ప్రొటీన్ కవచాన్ని క్యాప్సైడ్ అంటారు. లెనాకాపావిర్ (లెన్ ఎస్ఏ).. ఫ్యూజన్ క్యాప్సైడ్ ఇన్హిబిటర్ఆ పనిచేస్తుంది. ప్రొటీన్ కవచాన్ని ఈ ఔషధం లక్ష్యంగా చేసుకుంటుంది. తాజా క్లినికల్ ప్రయోగంలో 16 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యువతులను ఎంపిక చేసుకున్నారు.

తూర్పు, దక్షిణ ఆఫ్రికాలో యువతులే హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లకు ఎక్కువ బాధితులవుతున్నారు. పరీక్షార్థులకు లెన్ ఎస్ఏ మందును ఆరు నెలలకోసారి ఇంజెక్షన్ ద్వారా ఎక్కించారు. ఈ ప్రయోగంలో పలు అంశాలను పరిశీలించారు.

ట్రువాడా, డెస్కోవీ అనే రెండు మాత్రలతో పోల్చినప్పుడు దీని సామర్థ్యాన్ని పరీక్షించారు. లెన్ ఎల్ఎ పొందిన 2,134 మంది మహిళల్లో ఒక్కరికి కూడా హెచ్ఐవీ సోకలేదని వెల్లడైంది. ట్రువాడా మాత్రలు వేసుకున్నవారిలో 1.5 శాతం మంది, డెస్కోవీ పొందిన వారిలో 1.8 శాతం మంది ఈ ఇన్ఫెక్షన్ బారినపడ్డారని తేలింది.

గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 13 లక్షల హెచ్ఐవీ కేసులు కొత్తగా వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ప్రజలను ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడటానికి ఒక సమర్థ నివారణ సాధనంగా ఇది ఉపయోగపడుతుందని తాజా ప్రయోగం ద్వారా తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు