TRANSFERS – బదిలీ మార్గదర్శకాలపై హైకోర్టు స్టే

BIKKI NEWS (JULY 14) : high court stay on transfer guidelines. మైనారిటీ గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది బదిలీల కొరకు జూలై 6న విడుదల చేసిన మార్గదర్శకాల అమలును జూలై 18 వరకు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ గురుకుల సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ జి.హేమలత, మరికొందరు వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గురుకులాల సిబ్బందిని తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ సర్వీసు నిబంధనల పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం 2022 జులై 7న ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అయితే వాటిని సవాలు చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా, వాటి అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా బదిలీ మార్గదర్శకాలను జారీ చేయడం చట్ట, రాజ్యాంగ విరుద్ధమన్నారు.

రాష్ట్రపతి ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుంటూ యూనిట్‌ ట్రాన్స్‌ఫర్‌ కింద మార్గదర్శకాలు జారీ చేశారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. వివరణ ఇవ్వాలని గురుకులాల కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను జూలై 18కి వాయిదా వేశారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు