Contract Job – గురుకుల స్పోర్ట్స్ అకాడమీ లో హ్యాండ్ బాల్ కోచ్

BIKKI NEWS (JUNE 12) : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న స్పోర్ట్స్ అకాడమీలో పూర్తిగా తాత్కాలిక పద్ధతిలో హ్యాండ్ బాల్ కోచ్ పోస్టును భర్తీ (hand ball coach post in gurukula sports academy) చేయనున్నారు.

NIS డిప్లొమా లేదా NIS సర్టిఫికెట్ కోర్స్ అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 20న ఉదయం 10.00 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఒక ప్రకటనలో తెలిపారు.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఒక జిరాక్స్ సెట్ సర్టిఫికెట్లను తీసుకొని ఇంటర్వ్యూకు హాజరు కావలసి ఉంటుంది.

ఇంటర్వ్యూ జరుగు స్థలము – తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హెడ్ ఆఫీస్, మసబ్ ట్యాంక్, హైదరాబాద్.