GURUKULA JOBS – ఈనెలలో పోస్టుల భర్తీకి చర్యలు

BIKKI NEWS (JUNE 15) : GURUKULA POSTINGS SOON. తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంక్షేమ గురుకుల సొసైటీల్లో ఉపాధ్యాయ, అధ్యాపక ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియను నెలలోపు ముగించేందుకు త్వరలో గురుకుల నియామక బోర్డు సమావేశం నిర్వహించనున్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి గురుకుల నియామక బోర్డు 2023 ఆగస్టులో కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించి, ఫిబ్రవరిలో ఫలితాలు వెల్లడించింది.

ఇందులో దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించినా., ఫలితాలు రావడానికి ఆలస్యమైంది. దాంతో వీరిని మినహాయించి మిగతా కేటగిరీల అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను ఇప్పించారు.

ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. వారికి పోస్టులో పంపిస్తామని చెప్పినప్పటికీ లోక్‌సభ ఎన్నికల కోడ్‌ వచ్చింది.

మొత్తానికి గురుకులాల్లో టీజీటీ, పీజీటీ, జేఎల్, డీఎల్‌ తదితర దాదాపు 1,600 పోస్టులకు పూర్తి స్థాయి ఫలితాలు, నియామక పత్రాల జారీ ప్రక్రియ నిలిచిపోయింది.

ప్రస్తుతం కోడ్‌ ముగియడంతో దివ్యాంగ కేటగిరీ అభ్యర్థుల తుది ఫలితాలతోపాటు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులందరికీ నియామక పత్రాలు ఇవ్వాల్సి ఉంది.

GURUKULA POSTINGS SOON

ఈనెలాఖరులోగా సాంకేతిక సమస్యలను అధిగమించి జులైలో పోస్టింగుల ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు గురుకుల బోర్డు ఛైర్‌పర్సన్, ఐఏఎస్‌ అధికారిణి ఆయేషా మస్రత్‌ఖానం ఆధ్వర్యంలో నియామక ప్రక్రియను ముగించేందుకు త్వరలో సభ్యులు సమావేశం కానున్నారు.

గతేడాది చేపట్టిన ఆర్ట్, క్రాఫ్ట్‌ టీచర్‌ పోస్టులకు పునఃపరీక్ష నిర్వహించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. దీనిపైనా బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది.

LATEST CURRENT AFFAIRS

FOLLOW US @ TELEGRAM