Gurukula Jobs – 24 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

BIKKI NEWS (JUNE 22) : GURUKULA JOBS CERTIFICATE VERIFICATION SCHEDULE 2024. తెలంగాణ రాష్ట్ర బీసీ గురుకుల సొసైటీ పరిధిలో ఉద్యోగం పొందిన అభ్యర్థులకు జూన్ 24 నుండి 30వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు ఒక ప్రకటనలో తెలిపారు.

అర్హత సాధించిన అభ్యర్థులు బంజారాహిల్స్ లోని బంజారా భవన్ లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరుకావాలని తెలిపారు. అభ్యర్థులందరూ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ లను తీసుకుని వెరిఫికేషన్ ప్రక్రియకు రావాలని సూచించారు.

ఇప్పటికే ఈ పోస్టులకు సంబంధించి నిరుద్ జాబితాలను సబ్జెక్టుల వారీగా విడుదల చేయడం జరిగింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టులను కేటాయించనున్నట్లు సమాచారం. కావున అభ్యర్థులు కచ్చితంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కావలసి ఉంటుంది.

GURUKULA JOBS CERTIFICATE VERIFICATION SCHEDULE

జూన్ 24 న లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకై సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉండనుంది.

జూన్ 25న జూనియర్ లెక్చరర్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎకనామిక్స్, హిస్టరీ, సివిక్స్, కామర్స్, ఇంగ్లీష్ పేపర్లకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది

జూన్ 26 న జూనియర్ లెక్చరర్ ఇన్ తెలుగు, గణితం మరియు పిజిటి ఇన్ తెలుగు, హిందీ సబ్జెక్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉండనుంది.

జూన్ 27న పిజిటి ఇన్ ఇంగ్లీష్, గణితం, ఫిజిక్స్, బయాలజీ సోషల్ మరియు ఫిజికల్ డైరెక్టర్ గ్రేడ్ 2 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉండనుంది

జూన్ 28న టీజీటి ఇన్ హిందీ, సోషల్, బయాలజికల్ సైన్స్ సబ్జెక్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉండనుంది

జూన్ 29 న టీజీటి ఇన్ ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరపనున్నారు.

జూన్ 30 న టిజీటి తెలుగు, మరియు గణితం సబ్జెక్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరగనుంది.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు