Home > EMPLOYEES NEWS > గెస్ట్ లెక్చరర్ ల కొనసాగింపుకై సీఎం రేవంత్ రెడ్డికి వినతి

గెస్ట్ లెక్చరర్ ల కొనసాగింపుకై సీఎం రేవంత్ రెడ్డికి వినతి

BIKKI NEWS (AUG. 21) : Gurest lecturers continuation request to CM Revanth Reddy. సిద్దిపేట జిల్లా గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ (2152) ఈ విద్యా సంవత్సరం గెస్ట్ లెక్చరర్ ల కొనసాగింపు కు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని, అలాగే తమకు ఉద్యోగ భద్రతా కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఉద్యోగులుగా ఉన్న తమను నిరుద్యోగులుగా మార్చవద్దని విన్నవించారు.

Gurest lecturers continuation request to CM Revanth Reddy

సిద్దిపేట జిల్లా పర్యటనకు వచ్చిన సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యులు శ్రీ మైనంపల్లి హనుమంతరావును కలిసి గెస్ట్ లెక్చర్ సమస్యల పైన వినతిపత్రం ఇవ్వగా సానుకూలంగా స్పందించి మీ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి గారికి చేరవేసి మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. తదనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.

అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ దేవయ్య గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 402 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారు 6,000 మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారని దానిలో 1,000 మంది రెగ్యులర్ లెక్చరర్స్ కాగా 3,200 మంది కాంట్రాక్టర్ లెక్చరర్స్ ని గత ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసిందని
కానీ చివరగా అభద్రతతో మిగిలిన 1,654 మంది గెస్ట్ లెక్చరర్స్ ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని ముఖ్యంగా కాంగ్రెస్ ప్రధాన మంత్రి అభ్యర్థి అయిన రాహుల్ గాంధీ గారు తమ జోడయాత్రలో ఇంటర్మీడియట్ గెస్ట్ లెక్చరర్ అందర్నీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని కావున గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మా యెడల దయతలచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,654 మంది గెస్ట్ లెక్చరర్ల కు ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నవించడం జరిగింది.

తదనంతరం అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున్ గారు మాట్లాడుతూ ప్రభుత్వము ఏర్పాటు అయినప్పటినుండి గౌరవ మంత్రులు శ్రీధర్ బాబు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మిగతా మంత్రులందరూ సానుకూలంగా స్పందించి మీ సమస్యపై క్యాబినెట్ చర్చించి న్యాయం జరుగేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారని గుర్తు చేశారు.కావున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెస్ట్ లెక్చరర్ ల యందు దయతలచి ఉద్యోగ భద్రత కల్పించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది.

తదనంతరం అసోసియేషన్ లేడీ జనరల్ సెక్రటరీ రేణుక మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ కొవ్వోత్తిలా కరిగిపోతు విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపుతున్న మాకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేశారు.

చివరగా అసోసియేషన్ సభ్యులు అశోక్ సార్ మాట్లాడుతూ ఇది రైతుల, పేదల, ఉద్యోగుల, నిరుద్యోగుల ప్రభుత్వమని ఇప్పటివరకు ఉద్యోగులుగా కొనసాగుతున్న మమ్మల్ని నిరుద్యోగులుగా మార్చి రోడ్డుపాలు చేయకుండా ఉద్యోగులుగా కొనసాగింపజేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి గారి రిక్వెస్ట్ చేశారు. ఈ సమావేశంలో బాల్ లింగం, కార్తీక్, మౌనిక, శ్రీనివాస్, ప్రవీణ్, కొమరయ్య, బాల సిద్ధయ్య, చంద్రమోహన్, దీపారాణి,.రేవతి తదితరులు పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు