BIKKI NEWS (MAY 30) : అతిధి అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని (Guest junior lecturers issues) జగిత్యాల జిల్లా కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని 1145 అతిధి ఆధ్యాపక సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు గుర్రాల సాయికృష్ణ మరియు కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, ప్రవీణ్, ఇస్తేకార్, రాజ్ కుమార్, శంకరయ్య, శిరీష కలిసి సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకోవడం జరిగింది.
గత పది సంవత్సరాలుగా రాష్ట్ర మొత్తం మీద 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 1,654 మంది మరియు జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న 56 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాల బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని, కానీ ప్రతి సంవత్సరం మాకు చాలీచాలని జీతాలతో సంవత్సర కాలం పనికి 6, 7 నెలలో జీతంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
పైసమస్యల పై ఎమ్మెల్సీ గారిని కలవడంతో వారు తక్షణమే స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని సీఎం గారికి, బోర్డ్ కార్యదర్శి గారికి, ప్రిన్సిపల్ సెక్రెటరీ గారికి వారు ఒక లేఖ రాసి స్వయంగా దానిని తీసుకువెళ్లి హైదరాబాద్ లో అప్పగించి ఆ సమస్యల పరిష్కారానికి చేస్తారని హామీ ఇవ్వడం జరిగిందని సాయికృష్ణ తెలిపారు.