BIKKI NIMS : ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ & పీస్ (IEP) అంతర్జాతీయ థింక్-ట్యాంక్ ద్వారా రూపొందించబడిన 17వ GLOBAL PEACE INDEX 2023 (GPI) REPORT నివేదికను విడుదల చేసింది.
ఈ నివేదిక శాంతి, దాని ఆర్థిక విలువ, పోకడలు మరియు శాంతియుత సమాజాలను ఎలా అభివృద్ధి చేయాలి అనే దానిపై ఇప్పటి వరకు అత్యంత సమగ్రమైన డేటా-ఆధారిత విశ్లేషణను అందిస్తుంది. ఈ నివేదిక ప్రపంచ జనాభాలో 99.7% మందిని కవర్ చేస్తుంది. 23 గుణాత్మక మరియు పరిమాణాత్మక సూచికలను ఉపయోగిస్తుంది.
2023వ సంవత్సరానికి గానూ 17వ గ్లోబల్ పీస్ ఇండెక్స్ (global peace index 2023) నివేదికలో 163 దేశాలలో పరిస్థితులపై నివేదిక వివరించింది.
ఈ నివేదికలో మొదటి స్థానంలో ఐస్‌లాండ్, చివరి స్థానంలో ఆప్ఘనిస్థాన్ ఉన్నాయి.
◆ Global Peace Index 2023 India Rank :
గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023లో భారత్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 126వ స్థానంలో నిలిచింది. (Global peace index 2023 india rank 126), పాకిస్థాన్ 146వ స్థానంలో ఉంది.
◆ GPI 2023 RUSSIA & UKRAINE RANK
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ రెండు దేశాలు చివరి పది స్థానాలలో నిలిచాయి. రష్యా 158 వ స్థానంలో, ఉక్రెయిన్ 157వ స్థానంలో నిలిచాయి.
◆ GPI – మొదటి పది దేశాలు :
1) ఐస్‌లాండ్
2) డెన్మార్క్
3) ఐర్లాండ్
4) న్యూజిలాండ్
5) ఆస్ట్రియా
6) సింగపూర్
7) పోర్చుగల్
8) స్లోవెనియా
9) జపాన్
10) స్విట్జర్లాండ్
◆ GPI – చివరి 10 దేశాలు
163) ఆప్ఘనిస్థాన్
162) యొమెన్
161) సిరియా
160) దక్షిణ సూడాన్
159) కాంగో
158) రష్యా
157) ఉక్రెయిన్
156) సోమాలియా
155) సూడాన్
154) ఇరాక్
◆ GIP – భారత పొరుగు దేశాలు
17) భూటాన్
79) నేపాల్
80) చైనా
88) బంగ్లాదేశ్
107) శ్రీలంక
126) ఇండియా
145) మయన్మార్
146) పాకిస్థాన్
163) ఆప్ఘనిస్థాన్
★ మరిన్ని వార్తలు