Bపాల్KKI NEWS (SEP. 20) : Freshers day celebrations in gjc girls husnabad. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిలు ప్రథమ సంవత్సరం విద్యార్థినిలకు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది.
Freshers day celebrations in gjc girls husnabad
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి కందుల శోభా దేవి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… విద్యార్థినిలు కలలు కనండి కలలు నెరవేర్చే క్రమంలో కష్టపడి మంచి ఫలితాలను సాధించాలని తెలుపుతూ, విద్యార్థినిలు గత ఫలితాలు కంటే అత్యధిక ఫలితాలను సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకులను తీసుకురావాలని ఆకాంక్షించారు.
అనంతరము కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ గంగాధర్ మాట్లాడుతూ… విద్యార్థినిలు ప్రణాళికతో చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని సూచిస్తూ, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలి అన్నారు.
కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మీయ అతిథి జెడ్ పి హెచ్ ఎస్
బాలికలు హుస్నాబాద్ ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకటయ్య మాట్లాడుతూ… విద్యార్థినిలు నైతిక విలువలు కలిగి ఉండాలని అన్నారు. అనంతరము విద్యార్థినిల యొక్క డాన్సులు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం డి. రవీందర్, సదానందం, బి లక్ష్మయ్య, ఎన్ ఎస్ ఎస్ పిఓ డి కరుణాకర్, సంపత్, టి్ నిర్మలాదేవి ,జి. కవిత, కవిత, పి్ రాజేంద్ర ప్రసాద్ ,అధ్యాపకేతర బృందం రాములు, విద్యార్థినిలు, మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మొదలగు వారు పాల్గొన్నారు.