Home > EDUCATION > తెలంగాణ దర్శిని – విద్యార్థులకు పర్యాటక, చారిత్ర‌క ప్రాంతాల ఉచిత సందర్శన

తెలంగాణ దర్శిని – విద్యార్థులకు పర్యాటక, చారిత్ర‌క ప్రాంతాల ఉచిత సందర్శన

BIKKI NEWS (SEP. 28) : free tourism trips for government school students. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చదివే విద్యార్థులకు శుభవార్త. పర్యాటక, చారిత్ర‌క ప్రాంతాలను విద్యార్థులు ఉచితంగా సందర్శించే అవకాశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించారు. ‘తెలంగాణ దర్శిని’ పేరుతో ఈ మేరకు కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయ్యాయి.

free tourism trips for government school students.

విద్యార్థులు తరగతి గదిలో కూర్చొని విషయాలను పాఠాలుగా వినడం కంటే ప్రత్యక్షంగా చూసి అనుభవించడం వల్ల ఎక్కువ జ్ఞానాన్ని పొందుతారనే శాస్త్రీయ నిరూపణలున్న నేపథ్యంలో చారిత్ర‌క‌, పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని తలపెట్టారు. ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో కలిసి సీఎం గారు తెలంగాణ దర్శిని పోస్టర్ ను ఆవిష్కరించారు.

రెండో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్థులను కేటగిరీలుగా విభజించి, ఆయా ప్రాంతాల్లోని పర్యాటక క్షేత్రాలను చూపిస్తారు. రవాణా, ఇతరత్రా ఖర్చుల కోసం ప్రభుత్వం రూ12.10 కోట్ల నిధులు విడుదల చేసింది. తొలి దశలో 1లక్ష మంది విద్యార్థులను పర్యాటక స్థలాలకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నోడల్ ఆఫీసర్లు నియమించే కమిటీలు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. తెలంగాణ దర్శినికి సంబంధించిన విధివిధానాలను జీవోలో పొందుపర్చారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు