BIKKI NEWS (JAN. 26) : ఏ రకమైన వైద్య బీమా ఉన్న, ఏ దేశంలోని ఏ హస్పిటల్ లో అయినా డబ్బులు లేకుండా(నగదు రహిత) చికిత్స పొందవచ్చు (free health treatment with health insurance at any hospital) అంటూ ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నూతన మార్గదర్శకాలు ప్రకటించింది.
మీ దగ్గర ఏ కంపెనీ వైద్య బీమా ఉన్నా ఆపత్సమయాలతో పాటు, ఇతర వైద్య సేవలకు కూడా ఏ ప్రైవేటు దవాఖానలోనైనా నగదు రహిత వైద్యం పొందవచ్చు. ఈ నిర్ణయం గురువారం నుంచి అమల్లోకి వచ్చినట్టు ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ప్రకటించింది
గతంలో బీమా కంపెనీల జాబితాలో ఉన్న దవాఖానల్లోనే క్యాష్ లెస్ చికిత్స పొందే అవకాశం ఉండేది. ఒక వేళ జాబితా(నెట్‌వర్క్)లో లేని దవాఖానల్లో చికిత్స పొందితే రీయంబర్స్‌మెంట్ (ముందు డబ్బులు చెల్లించి, తరువాత చెల్లింపులను పొందే) పొందే నియామాలు అమలులో ఉండేవి. కానీ వినియోగ దారుల ఇబ్బందుల దృష్ట్యా జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చించి, ప్రతి చోటా నగదు రహిత వైద్య సేవల సదుపాయాన్ని తీసుకొచ్చింది. తాజా నిర్ణయంతో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నవారికి ఎంతో లాభం కలుగుతుందని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ప్రకటించింది
★ కొత్త మార్గదర్శకాలు
జాబితాలో లేని హాస్పిటల్‌లో చికిత్సపొందాలంటే కనీసం 48 గంటల ముందు సంబంధిత బీమా కంపెనీకి తెలియజేయాలి.
అత్యవసర వైద్య సేవల సమయాల్లో మాత్రం ఆరోగ్య బీమాదారులు దవాఖానలో చేరిన 48 గంటలలోపు బీమా కంపెనీకి సమాచారం అందించాలి.
పాలసీదారుడు కోట్ చేసే క్లెయిమ్ ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల ప్రకారం ఆమోదయోగ్యంగా ఉండాలి