Home > CURRENT AFFAIRS > STATISTICAL DATA > FIRST WOMEN’S of INDIA – మొట్టమొదటి భారతీయ మహిళామణులు

FIRST WOMEN’S of INDIA – మొట్టమొదటి భారతీయ మహిళామణులు

BIKKI NEWS : పోటీ పరీక్షల నేపథ్యంలో భారతదేశపు మొట్టమొదటి భారతీయ మహిళామణులు (FIRST WOMEN’S of INDIA) జాబితా చూద్దాం.

● భారత.మొదటి మహిళా ప్రధానమంత్రి – ఇందిరా గాంధీ

● ఎన్నికల్లో ఓడిపోయిన తొలి ప్రధాని – ఇందిరా గాంధీ

● రాజ్యసభ నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి – ఇందిరా గాంధీ

● మొదటి మహిళా ముఖ్యమంత్రి – సుచేతా కృపలాని (ఉత్తరప్రదేశ్ 1988-87)

● మొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి – మాయావతి (యూపీ 1995)

● మొదటి కేంద్ర మహిళా మంత్రి – రాజకుమారి అమృత్ కౌర్ (ఆరోగ్యశాఖ 1947 -57)

◆ దేశంలో తొలి మహిళా కేంద్ర మంత్రి – విజయలక్ష్మీ పండిట్ (1987)

● రాష్ట్ర శాసన సభ మొదటి మహిళా స్పీకర్ – షన్నో దేవి (హర్యానా)

● మొదటి మహిళా గవర్నర్ – సరోజినీ నాయుడు (యూపీ 1947 – 49)

● జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు – అనిబిసెంట్

● జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన తొలి భారత మహిళ – సరోజినీ నాయుడు(1925)

● ఐరాస జనరల్ అసెంబ్లీ మొదటి అధ్యక్షురాలు- విజయలక్ష్మీ పండిట్ (1953)

● తొలి మహిళా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ – వీఎస్ రమాదేవి (1990 నవంబర్ 26 నుంచి 1990 డిసెంబర్ 11 వరకు)

● జాతీయ మహిళా కమిషన్ తొలి చైర్ పర్సన్ – జయంతీ పట్నాయక్

● ఆర్‌బీఐ తొలి మహిళా డిప్యూటీ గవర్నర్ – కేజే ఉదేశి

● తొలి మహిళా రాయబారి – విజయలక్ష్మీ పండిట్ (సోవియటకు 1947-49)

● తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి – చోకిలా అయ్యర్

● ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన మొదటి మహిళ – రజియా సుల్తానా

● ఇంగ్లిష్ చానల్ ఈదిన తొలి మహిళ – ఆర్తీ సాహ(ఆర్త గుప్తా)

● ఎవరెస్టు అధిరోహించిన మొదటి మహిళ- బచేంద్రి పాల్ (1984లో)

● ప్రపంచాన్ని చుట్టిన మొదటి మహిళ – ఉజ్వల రాయ్

● మొదటి ఐఏఎస్ అధికారిణి – అన్నా జార్జి మల్హోత్రా

● మొదటి ఐపీఎస్ అధికారిణి – కిరణ్ బేడి (1972లో) –

● తొలి మహిళా డీజీపీ – కంచన్ చౌదరి భట్టాచార్య (ఉత్తరాఖండ్)

● ఐరాస సివిల్ పోలీసు సలహాదారుగా నియమితులైన తొలి భారత మహిళ –కిరణ్ బేడీ

● సైనిక దళం తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్ –పునీతా అరోరా

● మొదటి మహిళా వైస్ అడ్మిరల్ (నేవి) –పునీతా అరోరా

● వైమానిక దళంలో పైలట్ గా చేసిన తొలి మహిళ – హరితాకౌర్ దయాళ్ (1994)

● ఎయిర్‌బస్ మొదటి మహిళా పైలట్ –దుర్గా బెనర్జీ

● ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయురాలు – భాను అథయా (1982లో గాంధీ సినిమాకు కాస్ట్యూమ్స్ డిజైను అవార్డు దక్కింది)

● రామన్ మెగసెసె అవార్డు అందుకున్న తొలి మహిళ – మదర్ థెరిసా (1982)

● జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి మహిళ –ఆశాపూర్ణాదేవి (1976, ప్రథమ్ ప్రతిశ్రుతి, బెంగాలీ)

● పులిట్జర్ బహుమతి పొందిన తొలి భారతీయ మహిళ – ఝంపా లహరి (2000)

● బుకర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయ మహిళ – అరుంధతీరాయ్ (ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ 1997)

● దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి మహిళ – దేవికారాణి రోరిక్(1969)

● రాజీవ్ ఖేల్ రత్న పొందిన తొలి క్రీడాకారిణి – కరణం మల్లేశ్వరి -(1995)

● ఒలింపిక్స్ లో వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారతీ యురాలు – కరణం మల్లేశ్వరి (2000 వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్యం సాధించింది)

● ఒలింపిక్స్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి మహిళ – పీటీ ఉష (1984)

● ప్రపంచ అథ్లెటిక్స్ లో పతకం పొందిన తొలి భారతీయురాలు – అంజు బాబీ జార్జ్ మహిళ

● సప్తసముద్రాల్లోని ఏడు జలసంధులు ఈదీన తొలి భారతీయురాలు –బులా బౌదరి

● ఐదు ఖండాలలోని సముద్రాలు ఈదిన తొలి మహిళ – బులా చౌదరి

● ముఖ్యమంత్రి అయిన మొదటి సినీనటి – జానకీ రామ చంద్రన్ (తమిళనాడు – 1988 జనవరి 1 నుంచి 30 వరకు)

● అంటార్కిటికాను చేరుకున్న తొలి భారతీయ మహిళ – మోహర్ మూస్ (1976)

● పద్మశ్రీ పొందిన తొలి నటి – నర్గీస్ దత్ (1958)

● మొదటి మహిళా అడ్వొకేట్ – కర్నీలియా సోరాబ్ది (కోల్ కతా 1894)

● మొదటి మహిళా జడ్జి –అన్నా చాంది (1987 జిల్లా జడ్జిగా)

● హైకోర్టు మొదటి మహిళా జడ్జి – అన్నా చాంది (కేరళ హైకోర్టు 1959 – 67)

● సుప్రీంకోర్టు మొదటి మహిళా జడ్జి – మీరా సాహెబ్ ఫాతిమా బీవీ (1989)

● హైకోర్టు మొదటి మహిళా చీఫ్ జస్టిస్
లీలా సేథ్ (ఢిల్లీ – 1991- 98)

● తొలి మహిళా గ్రాడ్యుయేట్ డాక్టర్ – కాదంబినీ గంగూలీ

● ఎంఏ పాసైన మొదటి మహిళ – చంద్రముఖి బోస్

● ఆంగ్ల దినపత్రికకు మొదటి సంపాదకురాలు – దీనా వకీల్ (టైమ్స్ ఆఫ్ ఇండియా)

● మొదటి చీఫ్ ఇంజనీర్ – పీకే థెరిసా

● సేవా పతకాన్ని అందుకున్న తొలి మహిళ కానిస్టేబుల్ – బిమలాదేవి (సీఆర్‌పీఎఫ్)

● ఎవరెస్టు అధిరోహించిన పిన్న వయస్కురాలు – మాలావత్ పూర్ణ (13) – తెలంగాణ

◆ భారత మొదటి మహిళా మేజిస్ట్రేట్ – ఓమనా కుంజమ్మ

● భారత మొదటి మిస్ వరల్డ్ – రీటాఫారియా (1996)

● భారత మొదటి మిస్ యూనివర్స్ – సుస్మితాసేన్ (1994)

● భారత మొదటి మిస్ ఇండియా – ప్రమీల (1947)

● భారత మొదటి మిస్ ఏషియా ఫసిపిక్ – దియా మిర్జా

● భారత తొలి మహిళా వ్యోమగామి – కల్పనా చావ్లా(1997)

● భారత తొలి మహిళా రాష్ట్రపతి – ప్రతిభా పాటిల్ (2007)

● నోబెల్ బహుమతి పొందిన తొలి భారత మహిళ – మదర్ థెరిసా (1979)

● లోక్ సభ తొలి మహిళా స్పీకర్ – మీరాకుమార్ (2009-14)

● రాజ్యసభ తొలి మహిళా సెక్రటరీ జనరల్ – వీఎస్ రమాదేవి

● భారతీయ మొదటి మహిళా ఫొటో జర్నలిస్టు – హోమియా వ్యారవలా (బాంబే క్రానికల్ 1988) –

● భారత పోస్టల్ స్టాంప్ పై కనిపించిన తొలి మహిళ – మీరాబాయి

● భారత్ లో మొదటి మహిళా లోకోపైలెట్ – సురేఖా యాదవ్ (1992)

● వెండితెరపై మొదటి నటి – దేవికారాణి రోరిక్

● నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తొలి మహిళా అధ్యక్షురాలు – ఒమనా అబ్రహం (కేరళ – కొట్టాయం)

● మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ –బేబీ హర్ష (1982)

● ఆధార్ కార్డు పొందిన తొలి మహిళ – రజనాసోనావానే

● ఎవరెస్టును రెండుసార్లు అధిరోహించిన మహిళ – సంతోష్ యాదవ్ (1992-1993)