Home > EMPLOYEES NEWS > ఎన్నికల్లో లెక్చరర్ల ప్రచారంపై ఈసీకి ఫిర్యాదు

ఎన్నికల్లో లెక్చరర్ల ప్రచారంపై ఈసీకి ఫిర్యాదు

హైదరాబాద్ (జనవరి 15) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేశారంటూ 9 మంది ప్రభుత్వ లెక్చరర్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు (enquiry on election campaign of government lecturers in telangana) అందింది. ఓ పార్టీ అభ్యర్థికి మద్దతుగా సమావేశం నిర్వహించారని, ఆధారాలతో సహా ఓ వ్యక్తి వీరిపై ఈసీకి ఫిర్యాదు చేశారు.

స్పందించిన ఈసీ వారిపై తగు చర్యలు తీసుకోవాలంటూ ఇంటర్ విద్య కమిషనర్, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.