Home > EDUCATION > ENGINEERING > ENGINEERING SEATS SLIDING – ఇంజనీరింగ్ సీట్ల మార్పిడికి అవకాశం

ENGINEERING SEATS SLIDING – ఇంజనీరింగ్ సీట్ల మార్పిడికి అవకాశం

BIKKI NEWS (AUG. 14) : ENGINEERING SEATS SLIDING OPTION ON AUGUST 21,22. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీ సీట్ల మార్పిడి (స్లైడింగ్) కి ఆగస్టు 21, 22వ తేదీలలో అవకాశం కల్పించాలని సాంకేతిక విద్యా శాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియను ఈసారి ఇంజనీరింగ్ కళాశాలలో కాకుండా సాంకేతిక విద్యా కమిషనరేట్ నిర్వహించడం విశేషం. స్లైడింగ్ పేరుతో ప్రైవేట్ కళాశాలలు సాగిస్తున్న సీట్ల వ్యాపారానికి తెర వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ENGINEERING SEATS SLIDING OPTION ON AUGUST 21,22

తాజాగా తుది విడుత సీట్ల కేటాయింపు తర్వాత 5,039 సీట్లు మిగిలిపోయాయి. స్లైడింగ్ తర్వాత మిగిలిపోయే సీట్లను కలుపుకొని స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేయడానికి సాంకేతిక విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద ఆగస్టు నెలాఖరు వరకు కౌన్సిలింగ్ ముగించుకుని ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

స్లైడింగ్ ద్వారా దాదాపు 3000 సీట్లు మిగిలే అవకాశం ఉంటుందని అంచనా.. దీంతో మొత్తం మీద 8 వేల వరకు సీట్లు స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ కు అందుబాటులో ఉండనున్నాయి.

తుది విడతలో సీట్లు పొందిన వాళ్లు ఆగస్టు 17 నాటికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇలా చేయని పక్షంలో ఆ సీటును ఖాళీ అయినట్లుగా ప్రకటిస్తారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు