BIKKI NEWS (APRIL 12) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 61 ఏళ్ళు నిండిన తర్వాత లేదా 33 ఏళ్ళ సర్వీస్ పూర్తయిన తర్వాత ఏది ముందైతే దాని ప్రకారం (Employees retirement after 33 years service) ఉండేటట్లు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక దృవీకరణ అవసరం.
పార్లమెంట్ ఎన్నికల ముగిసిన తరువాత ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ నిర్ణయంతో భారీగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. వీటిని నూతన నోటిఫికేషన్ ల ద్వారా భర్తీ చేయనున్నారు.
గతంలో కెసిఆర్ ప్రభుత్వం పదవి విరమణ వయసును 58 ఏళ్ల నుండి 61 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే. దాంతో పదవి ఉద్యోగుల పదవి విరమణ మార్చి 2024 నుండి మొదలైంది.