BIKKI NEWS (MARCH 17) : లోక్ సభ ఎన్నికల 2024 షెడ్యుల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ సమయంలో ప్రజలు, పార్టీలు, ఉద్యోగులు పాటించాల్సిన నియమాలు
కోడ్ నిబంధనలు
కోడ్ సమయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లను వినియోగించుకోవడానికి వీల్లేదు.
కొత్త పథకాలను ప్రారంభించవద్దు.
ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఎన్నికల అధికారులను బదిలీ చేయరాదు.
ప్రభుత్వ యంత్రాంగాన్ని, అధికారులను, వాహనాలను వాడటానికి వీల్లేదు.
ప్రభుత్వ స్థలాలు, కాలేజీలు, స్కూళ్లను ప్రచారానికి వినియోగించుకోవాల్సి ఉంటే రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలి.
రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లే వారు తప్పనిసరిగా ఆధారాలు తీసుకెళ్లాలి. లేకుంటే నగదును సీజ్ చేస్తారు.
బంగారం, వెండి ఆభరణాలకు కూడా సరైన ఆధారాలు చూపించాలి.
మద్యం రవాణాపై ఆంక్షలు ఉంటాయి.
మీడియాలో రాజకీయ పార్టీలు, వ్యక్తులకు అనుకూలంగా, పక్షపాతంగా ప్రచార కథనాలపై నిషేధం.
ఓటర్లను ప్రభావితం చేసేలా కుల, మతపరమైన వ్యాఖ్యలు చేయకూడదు. వదంతులు వ్యాప్తి చేయొద్దు.
ఓటర్లకు డబ్బులు పంచడం, భయపెట్టడానికి వీల్లేదు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక అభ్యర్థులు ఆర్థిక గ్రాంట్లు ప్రకటించడం నిషేధం.
ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలలో తాతాలిక నియామకాలు చేపట్టకూడదు.
ఎన్నికల్లో పోటీ చేసే మంత్రులు లేదా అభ్యర్థులు తమ పరిధిలోని నిధులను మంజూరు చేయకూడదు.
అభ్యర్థులు రాజకీయ నాయకుల సమావేశాలకు మున్సిపాలిటీ బహిరంగ ప్రదేశాల్లో మీటింగులకు ఉచిత ప్రవేశం కల్పించాలి.
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉండకూడదు. రాజకీయ నేతల పోస్టర్లు, కటౌట్‌లు, హోర్డింగులు తొలగించాలి.
ఎన్నికల అధికారులు, సిబ్బంది బదిలీలపై పూర్తిగా నిషేధం. మంత్రులు, రాజకీయ నేతలతో అధికారుల వీడియో కాన్ఫరెన్సులు ఉండవు.
లబ్ధిదారులకు ఇచ్చే పత్రాలపై ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉండకూడదు.
దేవాలయం, మసీదు, ప్రార్థనా స్థలాల్లో ప్రచారం చేయకూడదు.
పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ప్రచారం నిషిద్ధం. ఓటింగ్‌కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలపై నిషేధం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ప్రచారం చేయాలి.
నిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలు ఉంటాయి. పార్టీల ర్యాలీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
నామినేషన్‌నూ ఆన్‌లైన్‌లోనూ వేసుకొనే వెసులుబాటు ఉంది.
అభ్యర్థులు గరిష్ఠంగా రూ.95 లక్షలు ఖర్చు చేసేందుకు అవకాశం ఉన్నది.
నామినేషన్ కోసం ఓసీ, ఓబీసీ అభ్యర్థులు రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 డిపాజిట్ చెల్లించాలి.
నామినేషన్ దాఖలులో భాగంగా గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేసే నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఓటరు ప్రతిపాదకుడిగా ఉంటే సరిపోతుంది.
స్టార్ క్యాంపెయినర్లుగా రాష్ట్రంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు 40 మంది నాయకుల పేర్లను, రిజిస్ట్రర్డ్ పార్టీలు 20 మందిని నియమించుకునే అవకాశం కల్పించారు.
మ్యానిఫెస్టోను తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో ఎన్నికల సంఘానికి సమర్పించాలి
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు టీవీలు, పత్రికలు, బహిరంగ *ప్రకటనలు, ఎఫ్‌ఎంలు, సినిమాహాల్స్, సోషల్ మీడియా, వాయిస్ మెసేజ్‌లు, బల్క్ ఎస్‌ఎంఎస్‌లు, ఇలా అన్ని రకాల ప్రకటనలకు ముందుగా అనుమతి తీసుకోవాలి.
అభ్యర్థులు, రాజకీయ పార్టీలు చేసే వ్యయంపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీని కోసం వ్యయ పరిశీలకులు, సహాయ వ్యయ పరిశీలకులు, ఫ్లయింగ్ స్వాడ్‌లు, స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలు, వీడియో సర్వేలైన్స్ బృందాలు, వీడియో వీవింగ్ బృందాలు, అకౌంటింగ్ బృందాలు, మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ), జిల్లా వ్యయ పరిశీలన కమిటీ (డీఈఎంసీ)లను ఏర్పాటు చేయనున్నది. వీటితో పాటు రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్, ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్, సీబీఐసీ, డీఆర్‌ఐ, సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ, కమర్షియల్ శాఖ, ఈడీ, ఎన్సీబీ, సీఐఎస్‌ఎఫ్, ఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ, ఐసీజీ, పోస్టల్, ఏఏఐ, ఆర్బీఐ, ఎస్‌ఎల్‌బీసీ, అటవీ శాఖలు అభ్యర్థుల వ్యయంపై తనిఖీలు నిర్వహిస్తాయి
బ్యాంకుల నుంచి రూ.లక్ష, అంత కంటే ఎక్కువ డ్రా చేసినా, జమ చేసినా ఆ అకౌంట్లపై నిఘా ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రూ.10 లక్షల కంటే ఎక్కువగా డ్రా చేస్తే వారి సమాచారాన్ని ఇన్‌కం టాక్స్ శాఖ అధికారులకు తెలపాలని సూచించింది. పోలీసులు, వివిధ శాఖల అధికారులు చేసే తనిఖీల్లో దొరికిన డబ్బును క్లియర్ చేయడానికి జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేశారు. సరైన ఆధారాలు చూపితే ఆ డబ్బును తిరిగి యజమానికి ఇవ్వనున్నారు.