Home > JOBS > APPRENTICESHIP > ECIL – 363 అప్రెంటిస్ ఖాళీలు

ECIL – 363 అప్రెంటిస్ ఖాళీలు

హైదరాబాద్ (డిసెంబర్ – 13) : హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL HYDERABAD APPRENTICESHIP) ఏడాది అప్రెంటిసిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది.

ఖాళీల వివరాలు:

  • గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ -250,
  • డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటిస్ -113.

విభాగాలు : ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్, ఈఈఈ, సివిల్, ఈఐఈ.

అర్హతలు : సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి : 31.12.2023 నాటికి 25 ఏళ్లు మించకూడదు.

స్టైపెండ్: నెలకు జీఈఏలకు రూ.9000/-, టీఏ అభ్యర్థులకు రూ 8000/- చొప్పున చెల్లిస్తారు

శిక్షణ కాలం: ఒక సంవత్సరం.

ఎంపిక విధానం: డిప్లొమా, బీఈ, బీటెక్ పరీక్షల్లో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్థలం: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, టీఐఎస్ఆర్ రోడ్, ఈసీఐఎల్, హైదరాబాద్.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.12.2023

ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: 21.12.2023, 22.12.2023.

వెబ్సైట్: https://www.ecil.co.in/