BIKKI NEWS (MARCH 19) : ఎర్త్ అవర్ లో భాగంగా దేశ వ్యాప్తంగా మార్చి 23న సాయంత్రం 8.30 – 9.30 PM ఒక గంట పాటు లైట్లు ఆఫ్ చేయాలని (earth hour on March 23rd) రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో “ఎర్త్ అవర్” పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎర్త్ అవర్ అనేది గ్రహం ఎదుర్కొంటున్న ట్రిపుల్ సంక్షోభాన్ని గుర్తించడానికి, వాతావరణ మార్పులు, జీవ-వైవిధ్య నష్టం, పర్యావరణం రక్షించడానికి దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, స్విచ్ ఆఫ్ పవర్ ద్వారా ఎర్త్ అవర్ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం వ్యక్తులు, సంస్థలు, వివిధ సంఘాలు అనవసరమైన లైట్లను ఒక గంట పాటు ఆఫ్ చేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్దేశించారు.
మార్చి 23, 2024న రాత్రి 8.30- 930 గంటల సమయంలో హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్, దుర్గం చెరువు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, బుద్ధ విగ్రహం, గోల్కొండ కోట, చార్మినార్, స్టేట్ లైబ్రరీ, రాష్ట్రంలోని ఇతర స్మారక చిహ్నాలన్నింటిలో లైట్లు ఆర్పాలని ఆమె కోరారు.