Home > LATEST NEWS > EAPCET 2024 COUNSELLING NEW SCHEDULE – ఎప్‌సెట్ నూతన కౌన్సెలింగ్ షెడ్యూల్

EAPCET 2024 COUNSELLING NEW SCHEDULE – ఎప్‌సెట్ నూతన కౌన్సెలింగ్ షెడ్యూల్

BIKKI NEWS (JUNE 26) : EAPCET 2024 COUNSELLING NEW SCHEDULE. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే ఎఫ్ సెట్ కౌన్సిలింగ్ 2024 షెడ్యూల్నం మార్పు చేస్తూ ఉన్నత విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

షెడ్యూల్ ప్రకారం జూన్ 27 నుండి ప్రారంభం కావాల్సి ఉండగా, నూతన షెడ్యూలు ప్రకారం జులై 04 నుంచి ప్రారంభం కానుంది.

దాదాపు 50 కళాశాలలో డిమాండ్ ఉన్న గ్రూపులలో సీట్ల సంఖ్య పెంచుకోవడం కోసం కేంద్రం (AICTE) నుండి అనుమతి తెచ్చుకున్నాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇంకా ఇవ్వలేదు. అనుమతి ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రారంభించాలని వాయిదా వేయడం జరిగినట్లు సమాచారం.

ఆప్ క్యాంపస్లకు ఈ విద్యా సంవత్సరం అనుమతులు ఇవ్వకూడదని ప్రాథమికంగా ఉన్నత విద్యాశాఖ నిర్ణయించినట్లు సమాచారం దీంతో ఈ ఏడాది కూడా ఆప్ క్యాంపస్లకు దరఖాస్తు చేసుకున్న కళాశాలలకు నిరాశ మిగులుతుంది.

వెబ్సైట్ కౌన్సిలింగ్ 2024 మొత్తం మూడు విడుదల లో నిర్వహించనున్నారు

EAPCET 2024 COUNSELLING NEW SCHEDULE

మొదటి విడత కౌన్సెలింగ్

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్ : జూలై 4 నుండి 12వ తేదీ వరకు

సర్టిఫికెట్ వెరిఫికేషన్ : జూలై 6 నుండి 13 వరకు

వెబ్ ఆప్షన్ల నమోదు : జూలై 8 నుండి 15 వరకు

సీట్ల కేటాయింపు : జూలై 19వ తేదీ లోపు

ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మరియు ఫీజు చెల్లింపు : జూలై 19 నుండి 23 వరకు

రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ జూలై 26 నుండి ఆగస్టు రెండో తేదీ మధ్య నిర్వహించనున్నారు

చివరి విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆగస్టు 8 నుండి 17వ తేదీల మధ్య నిర్వహించనున్నారు

అంతర్గత స్లైడింగ్ అవకాశం ఆగస్టు 21 నుండి 28 వరకు కల్పించనున్నారు.

స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాల జారీ తేదీ ఆగస్టు 28 న విడుదల చేయనున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు