BIKKI NEWS (JULY 15) : DSC WITH 6000 POSTS IN TELANGANA. పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న పోరాటం పై భట్టి విక్రమార్క స్పందించారు. పరీక్షలు వాయిదా వేయాలనడం సరికాదని, దాని వలన సంవత్సరాలుగా సిద్ధంమవుతున్న విద్యార్థులు నష్టపోతారని స్పష్టం చేశారు.
‘‘తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే యువతకు ఉద్యోగాల కోసం. అధికారంలోకి రాగానే 16వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్టు గుర్తించాం. 11వేల టీచరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం. ఇదే చివరి డీఎస్సీ కాదు.. మరిన్ని తీస్తాం. 5వేల నుంచి 6వేల పోస్టులతో మరో డీఎస్సీ త్వరలో ఉంటుంది అని తెలిపారు.
తాజాగా 19,717 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, 34 వేల మందిని బదిలీ చేశాం. ఈనెల 11 నుంచి డీఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులో ఉంచాం. కొన్ని నెలలుగా అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి, ధర్నాలు చేస్తున్నారు. పదేళ్లలో ఎన్నడూ గ్రూప్-1 నిర్వహించలేదు. గ్రూప్-2ను ఇప్పటికే 3 సార్లు వాయిదా వేశారు. పరీక్షలు అన్ని సార్లు వాయిదా వేయడం సరికాదు. త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వడమే మా లక్ష్యం. హాస్టల్ వెల్ఫేర్‌కి సంబంధించి 581 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించాం’ అని భట్టి విక్రమార్క తెలిపారు.
తాము నిరుద్యోగ యువత పైనే దృష్టి కేంద్రీకరించామన్న ఆయన మొదటి మూడు నెలల్లోనే 30వేల మందికి నియామక పత్రాలు ఇచ్చామని స్పష్టం చేశారు. మిగిలిన ఉద్యోగాలు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.