BIKKI NEWS (OCT. 07) : dsc 2024 posting and 327 go effected teachers. తెలంగాణ రాష్ట్ర డీఎస్సీ 2024 అభ్యర్థులకు నియామక పత్రాలను అక్టోబర్ 9న ఇవ్వనున్నారు. అయితే పోస్టింగ్‌కు కొంత సమయం పట్టనున్నట్లు సమాచారం.
dsc 2024 posting and 327 go effected teacher
దీనికి కారణం వెంటనే పోస్టింగ్ ఇస్తే జీవో 317 బాధితులకు తీరని అన్యాయం జరుగుతుందనే ఆలోచనతో వారి సమస్య పరిష్కారం అయినా తరువాత పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే 317 జీవో ప్రభావిత ఉద్యోగులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్లైన్ మరియు ఆప్‌లైన్ పద్దతిలో స్వీకరించిన మంత్రి వర్గ ఉపసంఘం దాదాపు వీరి సమస్య పరిష్కారం కొరకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సమాచారం ప్రకారం ఈ మంత్రి వర్గ ఉపసంఘం సోమవారం తుది భేటీ నిర్వహించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు దసరా లోపలే 317 జీవో బాధితులకు శుభవార్త చెబుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 317 ప్రభావిత ఉద్యోగులను అడ్జస్ట్ చేసిన తరువాతే నూతన టీచర్ పోస్టింగ్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఒకవేళ ముందే టీచర్ నియామకాలు చేపడితే 317 ప్రభావిత ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది.