BIKKI NEWS (APR. 05) : DOST 2025 NOTIFICATION. డిగ్రీ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల కోసం త్వరలోనే దోస్త్ 2025 నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది.
DOST 2025 NOTIFICATION
డిగ్రీ అడ్మిషన్లలో ఆన్లైన్ దోస్త్ ప్రక్రియను ఈ ఏడాది నుంచి ఎత్తివేయాలని నిర్ణయాన్ని ఉన్నత విద్యా మండలి వెనక్కి తీసుకుంది. దీంతో ఈ ఏడాది కూడా దోస్త్ ద్వారానే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది.
దోస్త్ 2025 అడ్మిషన్ల ప్రక్రియలను రెండు దశలోనే పూర్తి చేయాలని తెలిపింది
జూన్ 16 నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమయ్యేలా దోస్త్ నోటిఫికేషన్ 2025 విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీలో 4.6 లక్షల సీట్లు ఉండగా… 2.25 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చేరుతున్నారు. దీంతో జీరో అడ్మిషన్లు నమోదు అయ్యే కళాశాలలకు, కోర్సులకు అనుమతి ఇవ్వద్దని యూనివర్సిటీలకు ఉన్నత విద్యా మండలి ఈ సందర్భంగా సూచించింది.
- RRB JOBS – పదో తరగతితో రైల్వే లో 9970 జాబ్స్ నోటిఫికేషన్
- AP INTER RESULTS – ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు ఎప్రిల్ 12న – డైరెక్ట్ లింక్ ఇదే
- మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
- మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి నివాళులు
- FREE ONLINE TEST 24 – ఉచిత ఆన్లైన్ టెస్టు