Home > EDUCATION > Degree Syllabus – పోటీపరీక్షలకు అనుగుణంగా డిగ్రీ సిలబస్ లో మార్పులు

Degree Syllabus – పోటీపరీక్షలకు అనుగుణంగా డిగ్రీ సిలబస్ లో మార్పులు

BIKKI NEWS (DEC. 05) : Degree syllabus changing according to competitive exams. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి డిగ్రీ కోర్సుల సిలబస్‌ను సమగ్రంగా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి ఆర్ట్స్‌ కోర్సుల్లో 30%, సైన్స్‌ కోర్సుల్లో 20% సిలబస్‌ను మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఇక ప్రతి ఏటా 20 నుంచి 30 శాతం చొప్పున సిలబస్‌ను మార్చాలని నిర్ణయం.

Degree syllabus changing according to competitive exams

వీలైనంత త్వరగా కొత్త సిలబస్‌ను సిద్ధంచేసి వచ్చే విద్యాసంవత్సరం నాటికి అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్నత విద్యామండలి అధికారులు పనిచేస్తున్నారు.

ముఖ్యంగా ఆర్ట్స్‌ కోర్సుల సిలబస్‌ను పోటీ పరీక్షలకు అనుగుణంగా మార్చుతారు. సివిల్స్‌, గ్రూప్స్‌ లాంటి పోటీపరీక్షలకు అనుసరిస్తున్న సిలబస్‌ను డిగ్రీ ఆర్ట్స్‌ కోర్సుల్లో అంతర్భాగం చేస్తారు.

అలాగే ఇంజినీరింగ్‌లో 50% ఇంటర్న్‌షిప్‌ను అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. దీంతో 50% థియరీ క్లాసులు, మరో 50% ఇంటర్న్‌షిప్‌లు అమలవుతాయి.

డిగ్రీ విద్యార్థులకు క్షేత్రస్థాయి పర్యటనలను (ఫీల్డ్‌వర్క్స్‌), ప్రాజెక్టు రిపోర్టులు రూపొందించడాన్ని తప్పనిసరి చేస్తారు.

ఈ నెలలోనే వర్సిటీల వీసీలు, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ సమావేశాలను నిర్వహించడం ద్వారా సిలబస్‌ను ఆమోదించి, అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు