Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU MARCH 15th

DAILY GK BITS IN TELUGU MARCH 15th

DAILY G.K. BITS IN TELUGU MARCH 15th

1) BHIM అనగానేమి.?
జ : యూపీఐ, యుఎస్ఎస్డీలకు మరో బ్రాండ్

2) వ్యవసాయ వ్యర్ధాలతో నాచురల్ గ్యాస్ ను తయారు చేసే భారత మొదటి బయో సిఎన్జీ ప్లాంట్ ను ఎక్కడ ప్రారంభించారు.?
జ : పూనే

3) ప్రపంచంలోనే పెద్ద చరఖాను ఎక్కడ ఆవిష్కరించారు.?
జ : ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

4) సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : గుజరాత్

5) బంగారాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది.?
జ : కర్ణాటక

6) కజిరంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : అసోం

7) తెలంగాణ రాష్ట్రంలో లక్నవరం ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది.?
జ : ఆచార్య జయశంకర్ భూపాలపల్లి

8) తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు.?
జ : భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో

9) ఇత్తడి లోహ పనికి పేరుగాంచిన పెంబర్తి ఏ జిల్లాలో ఉంది.?
జ : జనగాం

10) తెలంగాణలో ముల్కనూరు ఆదర్శ గ్రామానికి దేనితో సంబంధం గలదు.?
జ : సహకార బ్యాంకింగ్

11) జై తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన నాయకుని పేరు ఏమిటి.?
జ : పి ఇంద్రారెడ్డి

12) ‘పల్లె పల్లె పట్టాల పైకి’ అనే నినాదం ఏ ఆందోళన సందర్భంగా వచ్చింది.?
జ : మిలియన్ మార్చ్

13) తెలంగాణ మలిదశ ఉద్యమ సందర్భంగా ఆత్మార్పణ చేసుకున్న తొలి విద్యార్థి ఎవరు.?
జ : శ్రీకాంతచారి

14) తెలంగాణ మలిదశ ఉద్యమం సమయంలో ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.?
జ : 2005

15) 1969 తెలంగాణ ఉద్యమాన్ని శాంతింప చేయడానికి ఇందిరా గాంధీ ప్రకటించిన పథకం ఏది?
జ : అష్ట సూత్ర పథకము