Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 6th APRIL

DAILY GK BITS IN TELUGU 6th APRIL

DAILY G.K. BITS IN TELUGU 6th APRIL

1) కాకతీయ వంశంలో కాకతి అనే పదానికి అర్థము ?
జ : గుమ్మడి లేదా కుష్మాండం

2) ప్రభుత్వ శాఖలలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి సమాచార హక్కు చట్టాన్ని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది.?
జ : 2005

3) సాధారణంగా ‘మల్లీద ముద్దలు’ అనే పిండి వంటకం తెలంగాణలో ఏ పండగ రోజు చేస్తారు.?
జ : బతుకమ్మ

4) నాగార్జున కొండ శిధిలాలను మొదట కనుగొన్నది ఎవరు?
జ : ఏ.ఆర్ సరస్వతి

5) తెలంగాణ ఉద్యమంలో భాగంగా “సడక్ బంద్” కార్యక్రమాన్ని ఏరోజు నిర్వహించారు.?
జ : 2013 మార్చి 21

6) “నిజాం రాజ అండమాన్” అని ఏ జైలును అంటారు.?
జ : మన్ననూరు

7) సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయమును నిర్మించిన వారు ఎవరు.?
జ : సూరిటి అప్పయ్య

8) 1997 ఆగస్టు 11న సూర్యాపేటలో జరిగిన తెలంగాణ మహాసభ సదస్సు పేరు.?
జ : దోఖా తిన్న తెలంగాణ

9) తెలంగాణ తల్లి విగ్రహంలో ఒక చేతిలో బతుకమ్మను పట్టుకోగా.. మరొక చేతిలో ఏమి ఉంటుంది.?
జ : మొక్కజొన్న కంకి

10) తొమ్మిదో శతాబ్దంలో తెలంగాణ మాండలిక భాషలో వరంగల్ లో వెలవడిన శాసనం పేరు ఏమిటి?
జ : కొరివి శాసనం

11) కాకతీయుల కాలంనాటి ప్రఖ్యాత నృత్యం పేరు ఏమిటి?
జ : పేరిణి శివతాండవం

12) రాజ్ గురు, సుక్ దేవ్, భగత్ సింగ్ లను బ్రిటిష్ ప్రభుత్వం 1931లో మార్చి 23న ఏ జైలులో ఉరితీసింది.?
జ : లాహోర్

13) దివ్య జ్ఞాన సమాజాన్ని ఏ నగరంలో స్థాపించారు.?
జ : న్యూయార్క్

14) “ఇండియా విన్స్ ఫ్రీడం” అనే రచన ఎవరిది.?
జ : మౌలానా అబుల్ కలాం ఆజాద్

15) జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలి పదవి కాలం ఎంత.?
జ : మూడు సంవత్సరాలు