DAILY G.K. BITS IN TELUGU MARCH 3rd
1) ఏ జాతీయ పార్కు ఉష్ణ మండల స్థితి నుండి ఉప ఉష్ణ మండల స్థితికి… సమశీతోష్ణ స్థితి నుండి ఉత్తర ధ్రువ స్థాయికి మారుతుంది.?
జ : నియోర వాలి జాతీయ పార్క్
2) కొండ నుండి ఏనుగు విగ్రహాన్ని తొలచిన ప్రాంతం ఎక్కడ ఉంది.?
జ : ధౌలీ
3) సుస్థిర అడవుల అభివృద్ధికి బయో కార్బన్ ప్రోత్సాహక కార్యక్రమం ఏ సంస్థ ఆధ్వర్యంలో ఉంటుంది.?
జ : ప్రపంచ బ్యాంకు
4) భారత్లో ఉక్కు ఉత్పత్తి పరిశ్రమకు దేని దిగుమతి అవసరం.?
జ : రాక్షస బొగ్గు
5) భారత రాజ్యాంగంలోని ఐదవ, ఆరవ అధికారులు దేన్నీ కోసం నిత్దేశించారు.?
జ : గిరిజనుల ప్రయోజనాల పరిరక్షణ కోసం
6) భారత రాజ్యాంగం ఎవరి సంరక్షణలో ఉంటుంది.?
జ : రాష్ట్రపతి
7) ఏ జాతీయ ఉద్యమ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ లో చీలిక వచ్చి అతివాద, మితవాద వర్గాలుగా విడిపోయింది.?
జ : స్వదేశీ ఉద్యమం
8) ఏ ప్రాంతంలో బతికున్న చెట్ల వేళ్ళను నీటి ప్రవాహాలపై వంతెనలుగా పేరుస్తారు. అవి కాలక్రమంలో పటిష్టమవుతాయి.?
జ : మేఘాలయ
9) ఏ రాష్ట్రాలలో ఉష్ణ మండల తడి శాశ్వత పచ్చని అడవులు ఉంటాయి.?
జ : అరుణాచల్ ప్రదేశ్,. మిజోరం
10) ఏ అడవులలో టేకు కలప వృక్షాలు పెరుగుతాయి.?
జ : తేమగల ఉష్ణ మండల ఆకురాల్చు అడవులు
11) భారత సార్వ భౌమధికారాన్ని, సమైక్యతను, సమగ్రతను రాజ్యాంగంలో ఏ అధ్యాయాల ప్రకారం కాపాడతారు.?
జ : ప్రాథమిక విధులు
12) సంక్షేమ రాజ్యం అనే ఆదర్శాన్ని భారత రాజ్యాంగంలోని ఏ అధ్యాయంలో పొందుపరిచారు.?
జ : ఆదేశిక సూత్రాలలో
13) హీనీ వైరస్ ఏ జబ్బుకు సంబంధించినది.?
జ : స్వైన్ ఫ్లూ
14) కృష్ణా నది యొక్క ఉపనది దక్షిణ ఒడ్డున రాజ్యం ఏర్పరచుకొని ఒక దేవత ప్రతినిధిగా రాజ్యాన్ని పాలించింది ఎవరు.?
హరిహర రాయలు – 1
15) పార్లమెంటులో ఒక బిల్లును వైయసభల సంయుక్త సమావేశానికి నివేదించినప్పుడు దానిని ఎంత మెజార్టీతో ఆమోదిస్తారు.?
జ : సభకు హాజరైన సభ్యుల ఓటింగ్ లో సాధారణ మెజార్టీ ద్వారా
16) రూపాయి మారకం అనే మాట దేన్ని సూచిస్తుంది.?
జ : రూపాయిని ఇతర కరెన్సీల్లోకి ఇతర కరెన్సీలను రూపాయలోకి మారకాన్ని యదేచ్చగా అనుమతించడం
17) సివిల్ సర్వీసుల బోర్డుకు పదవిరీత్య చైర్మన్ ఎవరు.?
జ : ప్రధానమంత్రి
18) బుద్ధుడి జీవితంతో ముడిపడి ఉన్న రాజ్యాలు ఏవి.?
జ : కోసల, మగధ
19) ఏ ప్రాంతంలో మాడ అడవులు, సతత హరిత అడవుల, ఆకురాల్చు అడవుల మిశ్రమాన్ని చూడవచ్చు.?
జ : అండమాన్ నికోబార్ దీవులలో
20) మడ అడవులు అనగానేమి.?
జ : బురద నేలల్లో పెరిగే అడవులు