Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU MARCH 12th

DAILY G.K. BITS IN TELUGU MARCH 12th

DAILY G.K. BITS IN TELUGU MARCH 12th

1) ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథకర్త ఎవరు.?
జ : సురవరం ప్రతాపరెడ్డి

2) ‘ప్రజల మనిషి’, ‘గంగు’ ఎవరి రచనలు.?
జ : వట్టికోట అల్వార్ స్వామి

3) ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సహకార సంఘాలకు రాజ్యాంగ బద్ధత కల్పిస్తూ భారత రాజ్యాంగంలోని 9B భాగంలో చేర్చారు.?
జ : 97వ

4) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఖమ్మం జిల్లాలో తొలిసారిగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వ్యక్తి ఎవరు?
జ : రవీంద్రనాథ్

5) చిత్రకూట్ జలపాతాలు ఏ నదికి సంబంధించినవి.?
జ : ఇంద్రావతి నది

6)పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో ఏ ప్రాంతాలు ఉండేవి.?
జ : ఎనిమిది తెలుగు మాట్లాడే జిల్లాలు, ఐదు మరాఠీ మాట్లాడే జిల్లాలు, మూడు కన్నడ మాట్లాడే జిల్లాలు

7) హైదరాబాదులో మూసీ నది ద్వారా దారుణమైన వరదలు ఏ సంవత్సరంలో సంభవించాయి.?
జ : 1908

8) ముస్లింలలో వెనకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లను ఎంత శాతానికి పెంచడానికి ఏప్రిల్ 2017 లో తెలంగాణ అసెంబ్లీ ఒక బిల్లును ఆమోదించింది.?
జ : 12 శాతానికి

9) వేసవికాలంలో ధ్వని వేగంగా ప్రసరిస్తుంది. దీనికి గల కారణం ఏమిటి?
జ : అధిక ఉష్ణోగ్రత & అధిక ఆర్ద్రత వల్ల

10) పరమాణు కేంద్రాన్ని ఎవరు కనుగొన్నారు.?
జ : ఎర్నెస్ట్ రూథర్ ఫర్డ్

11) స్థూల జాతీయోత్పత్తి నుంచి దేనిని తీసివేయడం ద్వారా నికర జాతీయోత్పత్తి వస్తుంది.?
జ : తరుగుదల

12) ముల్కీ నిబంధనల కొనసాగింపు తీర్పును సమీక్షించడానికి ఏ కమిటీని నియమించారు.?
జ : వాంఛూ కమిటీ

13) డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ కాకుండా భారత ఉపరాష్ట్రపతిగా రెండుసార్లు పదవిని ఎవరు నిర్వహించారు.?
జ : హమీద్ అన్సారి

14) బతుకమ్మ పండుగలో పసుపు ముద్దతో తయారు చేసిన ఏ దేవతా ప్రతిమను పూజిస్తారు.?
జ : గౌరమ్మ

15) భారతదేశంలో వితంతు పునర్వివాహాన్ని చట్టబద్ధం గావించేందుకు విజయవంతంగా కృషిచేసిన సాంఘిక సంస్కర్త ఎవరు.?
జ : ఈశ్వరచంద్ర విద్యాసాగర్