DAILY G.K. BITS IN TELUGU JANUARY 24th
1) తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో ప్రధాని ఇందిరా గాంధీ అష్ట సూత్ర పథకాన్ని ఏ రోజు ప్రకటించారు.?
జ : 1969 ఏప్రిల్ 12
2) తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది.?
జ : తంగేడు పువ్వు
3) తెలంగాణ రాష్ట్రంలో మొదటి రైల్వే లైన్ ఏది.?
జ : సికింద్రాబాద్ వాడి మధ్య (1874 లో ప్రారంభమైంది)
4) తెలంగాణలో ఏడుపాయల జాతర ఏ జిల్లాకు సంబంధించినది.?
జ : మెదక్ జిల్లా
5) నావికాదళ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 4
6) సునీత విలియమ్స్ ఏ అంతరిక్ష వాహక నౌకతో సంబంధం కలిగి ఉన్నారు.?
జ : డిస్కవరీ
7) కల్పక్కం అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : తమిళనాడు
8) విటికల్చర్ వేటి గురించి అధ్యయనాన్ని వివరిస్తుంది.?
జ : ద్రాక్ష తోటల పెంపకం
9) చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బీ) ఏ పారిశ్రామిక తీర్మానం ద్వారా ఏర్పడింది.?
జ : 1990 పారిశ్రామిక తీర్మానం
10) భారత్ లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం.?
జ : 1952
11) సూర్యుని చుట్టూ గ్రహాలు ఏ ఆకారంలో భ్రమిస్తాయి.?
జ : దీర్ఘ వృత్తాకారంలో
12) ఎరిత్రియన్ సముద్రం అని ఏ మహాసముద్రానికి పేరు.?
జ : హిందూ మహాసముద్రము
13) వన్యపాణి సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు.?
జ : 1972
14) భారతదేశంలోని మొదటి భారజల కర్మాగారం ఏది.?
జ : నంగల్ (1962)
15) పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం రాజ్యాంగం లోని ఏ సవరణ ద్వారా అమల్లోకి వచ్చింది.?
జ : 52వ రాజ్యాంగ సవరణ
16) భారతదేశంలో ఇప్పటివరకు జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు అమలు చేశారు.?
జ : మూడుసార్లు
17) సూపర్ సోనిక్ వేగం అంటే ఏమిటి.?
జ : ఒక వస్తువు వేగం ధ్వని వేగం కంటే ఒకటి నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉంటే దాన్ని సూపర్ సోనిక్ వేగం అంటారు.
18) సెంటిగ్రేడ్ మరియు ఫారెన్ హీట్ ఉష్ణమాపకాలు ఏ రీడింగ్ వద్ద సమానంగా ఉంటాయి.?
జ : మైనస్ 40 డిగ్రీలు
19) ఆవర్తన పట్టికలో వాయు రూపంలో ఉన్న మూలకాల సంఖ్య ఎంత.?
జ : 11
20) రాతి ఉప్పు నుండి ఏ లోహాన్ని తయారుచేస్తారు.?
జ : సోడియం
Comments are closed.