DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 27th
1) రక్తనాళాలలో రక్తం గడ్డకుండా గడ్డ కట్టకుండా ఉండటంలో దోహదపడే కారణం ఏమిటి.?
జ :హెపారిన్
2) హెపరిన్ ను ఉత్పత్తి చేసే అవయువం పేరు ఏమిటి.?
జ : కాలేయం
3) ప్లాటినం, బంగారాలను కరిగించే ఆక్వారీజియా ఏ రసాయనాల మిశ్రమము.?
జ : హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు నైట్రిక్ ఆమ్లం
4) నొప్పులు మరియు సాదరణ జ్వరాలకు ఉపయోగించే ఆస్పిరిన్ యొక్క రసాయన నామం ఏమిటి?
జ : ఎసిటైల్ సాలిసిలిక్ ఆమ్లము
5) పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ఏ మంత్రిత్వ శాఖలలో రెండింటిని తెలంగాణ వారికి కేటాయించాలి.?
జ : హోమ్, ఆర్థిక ,రెవిన్యూ, ప్లానింగ్ మరియు అభివృద్ధి, వాణిజ్యము మరియు పరిశ్రమలు
6) ‘అమ్మ తెలంగాణమా…’ గేయ రచయిత ఎవరు.?
జ : గద్దర్
7) జవహర్ లాల్ నెహ్రూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తేదీ ఏది.?
జ : 11 – డిసెంబర్ – 1955
8) 1948లో భారత ప్రభుత్వం చేత నియమించబడిన భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్ కు అధ్యక్షుడు ఎవరు?
జ : ఎస్.కె ధార్
9) తెలంగాణ అమరవీరుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే 17 – 1969
10) రాష్ట్ర కూట రాజవంశంలో ప్రసిద్ధి చెందిన రాజు ఎవరు.?
జ : కృష్ణ – 1
11) హర్ష చరిత రచించినది ఎవరు?
జ : బాణబట్టుడు
12) ఏ పరాన్న జీవి కారణంగా అతినిద్రవ్యాధి సంభవిస్తుంది.?
జ : ట్రిపనోసోమా గాంబియన్సీ
13) బోదకాలు వ్యాధి ఏ సూక్ష్మజీవి వల్ల సంభవిస్తుంది.?
జ : ఉకరేరియా బ్రాంకాఫ్టి
14) భారతదేశంలో చెరుకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది.?
జ : ఉత్తర ప్రదేశ్
16) అధికంగా టేకు చెట్లు ఉన్న అడవులు ఏ అడవులకు ఉదాహరణ .?
జ : ఆకురాల్చు అడవులు
17) వెంబనాడ్ సరస్సు ఏ ప్రాంతంలో ఉంది.?
జ : మలబార్ తీరం
18) భారతీయ వీణ మరియు ఇరానియన్ తంబురాలను మేళవించి తయారుచేసిన సంగీత వాయిద్యం ఏది?
జ : సితార్
19) ఉదయపూర్ లోని జావార్ గనులు వేటికి ప్రసిద్ధి
జ : జింక్
20) కాల రేఖలు ఎవరి రచన.?
జ : అంపశయ్య నవీన్