BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 5th OCTOBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 5th OCTOBER 2024
1) షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని ఏ సంస్థ విజయవంతంగా పరీక్షించింది.?
జ : డీఆర్డీవో
2) ఏ దేశంలో మిలిటెంట్ల కాల్పుల్లో 600 మందికిపైగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఫ్రెంచ్ ప్రభుత్వ రక్షణ ఏజెన్సీ తెలిపింది.?
జ : బుర్కినా ఫాసో
3) రిజర్వు బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా ఎవరి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది.?
జ : రాజేశ్వర్ రావు
4) 2024 సెప్టెంబర్ 27తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరాయి.?
జ : 704.89
5) ప్రతిష్టాత్మకమైన ఇరానీ కప్ 2023)4 ను ఏ జట్టు గెలుచుకుంది.?
జ : ముంబై (ఈ ఏడాది రంజీ చాంపియన్ అయిన ముంబై)
6) నేపాల్ నుంచి బంగ్లాదేశ్ కు 40 మెగా వాట్ల విద్యుత్తు సరఫరా కోసం ఏ మూడు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది ?.
జ : భారత్, బంగ్లాదేశ్, నేపాల్
7) వరల్డ్ యానిమల్ డే ఏరోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 04
8) క్వాడ్ సదస్సు 2024 ఎక్కడ నిర్వహించారు.?
జ : విల్మింగ్‌టన్ (అమెరికా)
9) ఐరాస నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఎంత శాతం వృద్ధులు ఉండనున్నారు.?
జ : 16%
10) 1960 నుంచి 2024 వరకు భారత దేశంలో ఒంటి కొమ్ము ఖడ్గ మృగాల సంఖ్య ఎన్ని రేట్లు పెరిగింది. ప్రస్తుతం వాటి సంఖ్య ఎంత.?
జ : 5 రెట్లు పెరిగి, 3 వేలకు చేరింది.
11) దేశంలో అత్యధిక నిరుద్యోగిత రేటు ఏ రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం లో ఉంది.?
జ : లక్ష్యద్వీప్ (36.2%)
12) దేశంలో అత్యల్ప నిరుద్యోగిత రేటు ఏ రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం లో ఉంది.?
జ : మధ్యప్రదేశ్ (2.6%)
13) తాజాగా ఏడీబీ, డెలాయిట్ సంస్థలు 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు ను ఎంతగా అంచనా వేశాయి.?
జ : 7.0%
14) 1985 – 2023 మద్య ఎన్ని మిలియన్ హెక్టార్ల అటవీ ప్రాంతం అమోజాన్ అడవుల్లో తరిగిపోయింది.?
జ : 88 మిలియన్ హెక్టార్లు