Home > EMPLOYEES NEWS > CPS Employees Income Tax section-80CCD వివరణ

CPS Employees Income Tax section-80CCD వివరణ

BIKKI NEWS (FEB. 02) : కొత్త పెన్షన్ పైన (CPS EMPLOYEES INCOME TAX 2024 SECTIONS) నియామకమైన ఉద్యోగులు ఆదాయ మినహాయింపు కోసం ఉన్న సెక్షన్ 80CCD లో 3 SUB SECTIONS కలవు. అవి,

  1. 80CCD(1)
  2. 80CCD(1B)
  3. 80CCD(2)

80CCD(1) వివరణ:

కొత్త పెన్షన్ పై నియామకమైన ఉద్యోగులు వారి నెలవారి జీతం నుండి మినహాయించే 10% CPS Amount ఈ సెక్షన్ క్రిందికి వస్తుంది. దీని గరిష్ట పరిమితి 1,50,000/-. ఇది 80C లో అంతర్భాగంగా ఉంటుంది, అనగా 80 C లోని ఇతర మినహాయింపులతో కలుపుకొని మొత్తం 1,50,000/- మించకూడదు.

80CCD(1B) వివరణ:

కొత్త పెన్షన్ పై నియామకమైన ఉద్యోగులకు ఈ సెక్షన్ కింద అదనంగా 50,000/- మినహాయింపు కలదు. 80C లోని ఇతర మినహాయింపులతో కలుపుకుని 80CCD(1) సొమ్ము 1,50,000 పరిమితిని దాటిన తరువాత మిగిలిన సొమ్ము 80CCD(1B) సెక్షన్ క్రిందికి వచ్చును. దీని గరిష్ఠ పరిమితి 50,000/-.

80CCD(2) వివరణ:

నూతన పెన్షన్ కింద నియామకమైన ఉపాధ్యాయులు ఉద్యోగులకు ప్రభుత్వం (Employer) విడుదల చేసే మ్యాచింగ్ గ్రాంట్ ఈ సెక్షన్ కిందికి వస్తుంది. ఈ మ్యాచింగ్ గ్రాంట్ ను ఆదాయంలో కచ్చితంగా చూపించాలి మరియు ఈ సెక్షన్ కింద మినహాయింపుగా కూడా చూపించాలి. దీని గరిష్ఠ పరిమితి 1,50,000/-.