Home > EMPLOYEES NEWS > కాంట్రాక్టు, ఎంటీఎస్ సిబ్బందిని 61 సంవత్సరాల వరకు కొనసాగింపు

కాంట్రాక్టు, ఎంటీఎస్ సిబ్బందిని 61 సంవత్సరాల వరకు కొనసాగింపు

BIKKI NEWS (APRIL 29) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు ఎంటీఎస్ జూనియర్ లెక్చరర్ లను 61 సంవత్సరాల వరకు కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు (contract lecturers superannuation upto 61 years) జారీ చేసింది.

గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ వయసును 58 నుండి 61 పెంచినప్పటికీ కాంట్రాక్ట్ మరియు ఎం టి ఎస్, పార్ట్ టైం వంటి తాత్కాలిక సిబ్బందికి వయోపరిమితి పెంపు విషయంలో స్పష్టత లేకపోవడంతో వీరిని విధులలోకి తీసుకోలేదు.

తాజాగా 14 మంది కాంట్రాక్ట్, ఎం టి ఎస్, పార్ట్ టైం ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఇంటర్మీడియట్ సెక్రటరీకి విద్యాశాఖ సూచించింది.

వీరికి క్రమబద్ధీకరణకు అర్హత ఉన్నప్పటికీ వయోపరిమితి దాటిపోవడంతో క్రమబద్దీకరణకు కూడా నోచుకోలేదు.