వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద దాడిని ఖండిస్తున్నాం – TNGOS యూనియన్ జనగామ జిల్లా

BIKKI NEWS (NOV. 11) : condemned the Attack on Vikarabad district collector by TNGO. విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఐఏఎస్ ని కొంతమంది రైతుల పేరు మీద జరిపిన దాడికి మరియు కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి మీద జరిగిన దాడిని తెలంగాణ NGOs సంఘం తీవ్రంగా ఖండిస్తున్నామని ఒక ప్రకటనలో తెలియజేశారు.

condemned the Attack on Vikarabad district collector by TNGO

దోషులు ఎంతటి వారైనప్పటికీ చట్ట పరిధిలో శిక్షలు విధించాలని జిల్లా అత్యున్నత అధికారైన కలెక్టర్ ప్రతీక్ ఐఏఎస్ మీద జరిగిన దాడి పట్ల ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలని ప్రజాసేవలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని ఇట్టి సంఘటనపై తప్పక చర్య తీసుకోవాలని అన్నారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పట్టికీ వాటిని పరిష్కరించుకునే మార్గం తప్పక ఉంటుంది, అంతే గాని చట్టాన్ని తమ చేతిలో తీసుకొని అధికారుల మీద దాడులు చేయడం హేయమైన చర్యని దానికి తెలంగాణ NGOs సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదని తెలంగాణ NGOs’ సంఘం జనగామ జిల్లా అధ్యక్షులు &JAC చైర్మన్ ఖాజా షరీఫ్ తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలొ కార్యదర్శి పెండెల శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షులు రాజనర్సయ్య, కోశాధికారి యండి హాఫిజ్, ఉపాధ్యక్షులు సంపత్, రామ నర్సయ్య, ఉప్పలయ్య, జిల్లా ఇతర నాయకులు పత్రిక ముఖంగా దాడి పట్ల నిరసన పత్రిక ప్రకటనను విడుదల జేశారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు