BIKKI NEWS (JULY 21) : CM REVANTH REDDY REVIEW ON MEDIGADDA PROJECT. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, పరీక్షలు, కమిషన్ విచారణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు.
CM REVANTH REDDY REVIEW ON MEDIGADDA PROJECT
ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు.
ఢిల్లీలో శనివారం జరిగిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా అంశాలపై ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను వారికి తెలియజేశారు.
సోమవారం ఢిల్లీలో జరగనున్న ఎన్‌డీఎస్ఏ సమావేశంలో అధికారులు, ఇంజినీర్లు సమావేశంపైన ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.