BIKKI NEWS (MARCH 11) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భేటి అయిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాలకు భరోసా కల్పించారు. మంచి పి ఆర్ సి ని కల్పిస్తామని (cm revanth reddy offers best prc to employees) పెండింగ్ డిఏలు మరియు 2008 డీఎస్సీ అభ్యర్థుల సమస్యలను 12న జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అలాగే కీలకమైన పాత పెన్షన్ పద్ధతి అమలు విషయంలో హామీని పరిశీలిస్తామని, అలాగే 327 జీవో సమస్యలు పరిష్కారిస్తామని, పదోన్నతులు, బదిలీల ఉద్యోగులకు కల్పిస్తామని తెలిపారు.
ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలపై మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించామని, ఈ మంత్రివర్గ ఉప సంఘంతో గుర్తింపు పొందిన సంఘాలు నిరంతరం చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.
రెగ్యులర్ పోస్టుల్లో కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించి, పదోన్నతులకు కల్పిస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు కిందిస్థాయి సిబ్బందిని నియమించి వారికి నెలనెలా వేతనాలు అందేలా హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాల్ ల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని పేర్కొన్నారు. అలాగే పాఠశాలలు కళాశాలలకు ఉచిత విద్యుత్ అందజేస్తామని పేర్కొన్నారు.