CMRF – సీఎం రీలీఫ్ ఫండ్ దరఖాస్తు ఇక ఆన్లైన్ లో

BIKKI NEWS (JULY 02) : cm releif fund application now online. ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఇక నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. ఇందుకోసం సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్‌సైట్‌ https://cmrf.telangana.gov.in/ ను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు.

Cm Releif Fund Application Now Online

CMRF నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్య‌మంత్రి గారి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

గతంలో ఈ నిధులు పక్కదారి పట్టిన నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. ఇక ముందు సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఈ నెల 15 తర్వాత నుంచి ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు. సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలు తీసుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖను జత చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

అప్లికేషన్ లో సంబంధింత దరఖాస్తుదారుడి బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్‌లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్ కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్‌ను సంబంధిత ఆస్పత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సీఎంఆర్ఎఫ్ దరఖాస్తును ఆమోదించిన తర్వాత పక్కదారి పట్టే అవకాశం లేకుండా చెక్ పైన తప్పని సరిగా దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్‌ను ముద్రిస్తారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి సంబంధించిన నిధులు పక్కదారి పడుతున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంది. దీని ద్వారా నిజమైన లబ్ధిదారులకు నేరుగా సహాయం చేసే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడమే కాక, సంబంధిత పత్రాలన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

వెబ్సైట్ : https://cmrf.telangana.gov.in/

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు