క్యాండిడెట్స్ చెస్ టోర్నీ 2024 విజేత గుకేశ్

BIKKI NEWS (APRIL 23) : CANDIDATES CHESS 2024 WON BY GUKESH – క్యాండిడెట్స్ చెస్ టోర్నీ 2024 విజేతగా భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ నిలిచాడు.

17 ఏళ్ల దొమ్మరాజు గుకేశ్ టైటిల్ విజేతను నిర్ణయించే 14వ రౌండులో అమెరికా గ్రాండ్ మాస్టర్ నకమురాతో గేమ్ ను డ్రా చేసుకొని 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో టైటిల్ కైవసం అయింది.

క్యాండిడెట్స్ చెస్ టోర్నీ విజేతగా నిలిచిన అతిపిన్న వయస్కుడిగా గుకేశ్ రికార్డ్ సృష్టించాడు. ప్రైజ్ మనీ 78.50 లక్షలు గెలుపొందాడు.

విశ్వనాథన్ ఆనంద్ (2014) తర్వాత క్యాండిడేట్స్ టోర్నీ విజేతగా నిలిచిన రెండో భారత చెస్ ఆటగాడిగా గుకేశ్ రికార్డు సృష్టించాడు.

ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్షిప్ కు గుకేశ్ అర్హత సాధించాడు. ప్రపంచ ఛాంపియన్షిప్ లో డింగ్ లిరెన్ తో తలపడాల్సి ఉంటుంది. అక్కడ కూడా విజయం సాధిస్తే, అత్యంత పిన్న వయసులో ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న చెస్ ఆటగాడిగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.

క్యాండిడేట్స్ చెస్ టోర్నీ 2024 మహిళల విభాగంలో కోనేరు హంపి రెండో స్థానంలో నిలిచింది.