Home > TELANGANA > రాష్ట్ర విభజన అంశాలపై 18న కేబినెట్ భేటీ

రాష్ట్ర విభజన అంశాలపై 18న కేబినెట్ భేటీ

BIKKI NEWS (MAY – 16) : వచ్చే జూన్2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై (Cabinate meeting on AndhraPradesh Reorganisation Act 2014) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. వీటిపై చర్చించడానికి ఈ నెల 18న కేబినేట్ సమావేశం జరగనుంది.

షెడ్యూలు 9, షెడ్యూలు 10 లో పేర్కొన్న మేరకు పెండింగ్ లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల అంశాలు, ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీ వంటి అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది. ఈ పదేండ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత రాష్ట్ర అధీనంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.