Home > EDUCATION > CA EXAMS 2025 – సీఏ పరీక్షల షెడ్యూల్ ఇదే

CA EXAMS 2025 – సీఏ పరీక్షల షెడ్యూల్ ఇదే

BIKKI NEWS (JAN. 14) : CA MAY 2025 EXAMS SCHEDULE. సీఏ మే 2025 పరీక్షల షెడ్యూల్‌ను ఐసీఏఐ ప్రకటించింది. మే 15 నుంచి మే 21 వరకు సీఏ ఫౌండేషన్‌ పరీక్షలు జరగనున్నాయి. మే 3వ తేదీ నుంచి 14 వరకు సీఏ ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 2వ తేదీ నుంచి 13 వరకు సీఏ తుది (ఫైనల్‌) పరీక్షలు జరుగుతాయి.

CA MAY 2025 EXAMS SCHEDULE.

ఫౌండేషన్‌, ఇంటర్మీడియట్‌, ఫైనల్‌ పరీక్షల కోసం అభ్యర్థులు పోర్టల్‌లో దరఖాస్తు చేసుకొని, ఫీజు చెల్లించాలని ఐసీఏఐ తెలిపింది.

దరఖాస్తు ప్రక్రియ మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని, ఆలస్య రుసుము లేకుండా మార్చి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.

రూ.600 ఆలస్య రుసుముతో మార్చి 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

వెబ్సైట్ : https://eservices.icai.org

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు