BIKKI NEWS (OCT. 06) : BSc Nursing Admissions 2024 in telangana. తెలంగాణ రాష్ట్రం లో 2024 – 25 విద్యా సంవత్సరం కొరకు కాళోజీ యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు.
BSc Nursing Admissions 2024 in telangana.
టీజీ-ఈఏపీసెట్-2024లో అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్‌సైన్సెస్ వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అక్టోబర్ 06 నుంచి 14 వరకు వెబ్‌సైట్‌లో సర్టిఫికెట్ లు అప్‌లోడ్ చేయాలని తెలిపారు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత అర్హత ప్రమాణాల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల తాత్కాలిక ఫైనల్ మెరిట్ స్థానం సిద్ధం చేయనున్నట్టు వివరించారు.