Home > NATIONAL > Bournvita – బోర్న్‌విటా హెల్త్ డ్రింక్ కాదు – కేంద్రం

Bournvita – బోర్న్‌విటా హెల్త్ డ్రింక్ కాదు – కేంద్రం

BIKKI NEWS (APRIL 13) : (Bournvita is not a health drink says central government)బోర్న్‌విటాలో చక్కర స్థాయిలు పరిమితికి మించి అధికంగా ఉన్నాయని ఇటీవల NCPCR నిర్ధారించిన నేపథ్యంలో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

బోర్న్‌విటాలో చక్కెర, కోకో స్థాయిలు అధికంగా ఉన్నాయని ఓ యూట్యూబర్ తన వీడియోలో విమర్శించడంతో ఈ వివాదం మొదలైంది. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అతడు విమర్శించడంతో ఎన్‌సీపీసీఆర్ రంగంలోకి దిగింది.

బోర్న్‌విటా ‘హెల్త్ డ్రింక్స్’ కేటగిరిలోకి రాబోదని తెలిపింది. ఈ కేటగిరి నుంచి బోర్న్‌విటాను తొలగించాలని ఈ-కామర్స్ కంపెనీలను వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. తమ వెబ్‌సైట్లు, ఇతర ప్లాట్‌ఫామ్స్‌పై బోర్న్‌విటాతో పాటు అన్ని డ్రింక్స్, బేవరేజులను హెల్త్ కేటగిరి నుంచి తొలగించాలని సలహా ఇచ్చింది.

బోర్న్‌విటాలో షుగర్ లెవల్స్ అధికంగా ఉన్నాయని, ఆమోదయోగ్య పరిమితులకు మించి ఎక్కువగా ఉన్నాయని NCPCR చేసిన పరిశోధనలో తేలిన నేపథ్యంలో కేంద్రం ఈ ఆదేశాలు ఇచ్చింది*

కాగా భద్రతా ప్రమాణాలు, మార్గదర్శకాలను పాటించడంలో విఫలమవ్వడమే కాకుండా పవర్ సప్లిమెంట్స్‌ను ‘హెల్త్ డ్రింక్స్’గా ప్రచారం చేసుకుంటున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని గతంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీని (FSSAI) ఎన్‌సీపీసీఆర్ కోరిన విషయం తెలిసిందే. కాగా రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం దేశంలోని ఆహార చట్టాలలో ‘హెల్త్ డ్రింక్’ నిర్వచించలేదు. దీంతో కంపెనీలు తమ ఉత్పత్తులను ఏమార్చుతూ ప్రచారం చేసుకుంటున్నాయి. డైయిరీ ఆధారిత పానీయాలను ‘హెల్త్ డ్రింక్స్’గా లేబుల్ వేసి విక్రయించవొద్దని ఈ నెల ఆరంభంలోనే ఈ-కామర్స్ పోర్టల్‌లను కేంద్రం ఆదేశించింది.