BIKKI NEWS (APR. 17) : Big relief for West Bengal teachers in supreme court. పశ్చిమ బెంగాల్ లో 25 వేలకు పైగా టీచర్లు ,నాన్ టీచింగ్ ఉద్యోగాల ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తాజాగా వారికి కొంత ఉపశమనం కల్పిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Big relief for West Bengal teachers in supreme court
ఈ తీర్పు గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగులకు వర్తించదని సుప్రీంకోర్టు తాజా ఆదేశాలలో పేర్కొంది. దీంతో గ్రూప్ సి గ్రూప్ డి ఉద్యోగులు యధావిధిగా తమ విధులలో కొనసాగవచ్చు.
అలాగే సుప్రీంకోర్టు తన తాజా ఆదేశాలలో మే 31న నూతన రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ జారీ చేసి, డిసెంబర్ 31 – 2025 వరకు నియామకాలు పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
అయితే ఈ నియామకాలు పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న టీచర్లను కొనసాగించాలని తన ఆదేశాలలో పేర్కొంది. దీంతో డిసెంబర్ 31 వరకు లేదా నూతన టీచర్ల నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న టీచర్లు తమ విధులలో కొనసాగే అవకాశం ఉంది.
అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయబోనని, తన ప్రాణం ఉన్నంతవరకు మీ ఉద్యోగాలు పోవని తాజాగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు కోర్టుదిక్కార నోటీసులను ప్రభుత్వానికి జారీ చేసింది.
- Inter Results ఎప్రిల్ 22న ఫలితాలు
- BHAGAVAD GITA – యూనెస్కో వారసత్వ సంపదలుగా భగవద్గీత, నాట్యశాస్త్రం
- 10th Result – ఏప్రిల్ 23న 10వ తరగతి ఫలితాలు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 19- 04 – 2025
- JEE MAINS (II) RESULT 2025 : జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల