BIKKI NEWS (JAN. 08) : బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా (76) వరుసగా నాలుగోసారి, మొత్తంగా అయిదోసారి అధికారం చేపట్టడం (Bangladesh new prime minister sheikh Chasina) ఖరారైంది. ఆదివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది.
మొత్తం 300 సీట్లకు గానూ 299 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆది వారం అర్ధరాత్రి వరకూ కొనసాగిన కౌంటింగ్ అవామీ లీగ్ 200 స్థానాలు గెలుచుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. షేక్ హసీనా గోపాల్ ఘంజ్-3 స్థానం నుంచి వరుసగా 8వ సారి అత్యంత భారీ మెజారిటీతో విజయం సాదించారు.
ఈసారి ప్రతి పక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్ఏ) సహా 15 ఇతర పార్టీలు ఎన్నికలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. దీంతో అ అభ్యర్థులు, స్వతంత్రులు మినహా ఇతర ప్రధాన పార్టీలు బరిలో లేకపోవడంతో ఓటర్లు పోలింగ్ పై ఆసక్తి చూపలేదు. విపక్షాల బహిష్కరణ, ఘర్షణ వాతావరణం మధ్య సాయంత్రం 4 గంటలకు ముగిసిన పోలింగ్ లో కేవలం 40 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 2018 ఎన్నికల నాటి 80 శాతం పోలింగ్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ.