BIKKI NEWS (SEP. 30) : Awareness program on HIV AIDS on GJC Girls Husnabad. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
Awareness program on HIV AIDS on GJC Girls Husnabad
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ శ్రీమతి కందుల శోభాదేవి గారు అధ్యక్షత వహించడం జరిగింది. కార్యక్రమానికి ప్రభుత్వ హస్పిటల్ హుస్నాబాద్ లో ఐసిటిసి కౌన్సిలర్ విధులు నిర్వహిస్తున్న ఆర్. తిరుపతి గారు హాజరు కావడం జరిగింది.
ఐ సి టి సి కౌన్సిలర్ తిరుపతి గారు మాట్లాడుతూ హెచ్ఐవి వైరస్ యొక్క వ్యాప్తిని మరియు వ్యాధి సోకకుండా తీసుకునే జాగ్రత్తలను తెలుపుతూ జీవన నైపుణ్యాలను గూర్చి అవగాహన కల్పించారు. వ్యాధి సోకిన వ్యక్తులు యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఐ సి టి సి కౌన్సిలర్ తిరుపతి గారు తెలిపారు.
అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఐ చైర్మన్ శ్రీమతి కందుల శోభా దేవి గారు మాట్లాడుతూ… ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు నివారణ ఒక్కటే మార్గం అని తెలుపుతూ విద్యార్థులను మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎయిడ్స్ వ్యాధిని గురించి సమాజానికి ర్యాలీలు మరియు సమావేశాల ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ డి కరుణాకర్ గారి యొక్క పర్యవేక్షణలో జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం డి. రవీందర్, ఎస్. సదానందం, బి. లక్ష్మయ్య, టీ. నిర్మలాదేవి, ఏ. సంపత్, ఎస్. కవిత, జి. కవిత, పి. రాజేంద్రప్రసాద్, జి. కవిత, అధ్యాపకతర బృందం సీనియర్ అసిస్టెంట్ రాములు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థినిలు మొదలగు వారు పాల్గొన్నారు.