BIKKI NEWS (NOV. 05) : Awareness Conference on Vocational Apprenticeship in vocational gjc kuthbullarpur. కె.యం.పాండు మెమోరియల్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల కుత్బుల్లాపూర్ లో వృత్తివిద్య కోర్సులు మరియు ఓ.జె.టి అప్రెంటిస్ పై కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి షేక్ మైమన్ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, డిఐఈవో కిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేందర్, ఎస్సై వి. డాక్టర్ జ్యోత్స్న రాణి, చీఫ్ గెస్ట్ ట్రైనింగ్ ఆఫీసర్ సతీష్ రెడ్డి పాల్గొన్నారు.
చీఫ్ గెస్ట్ ట్రైనింగ్ ఆఫీసర్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ… విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సుల పట్ల అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సు మంచి కార్యక్రమని, అలాగే విద్యార్థులు రెండు నెలల ఓజెటీ ద్వారా మంచి నైపుణ్యాలను ఎర్పర్చుకొని, ట్రైనింగ్ రిపోర్ట్ లో పేరు నమోదు చేసుకున్నట్లు అయితే మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించవచ్చని పేర్కొన్నారు.
అలాగే ఒకేషనల్ విద్యార్థులు బ్రిడ్జి కోర్సు పరీక్షలో ఉత్తీర్ణత సాధించి బి.టెక్ మరియు డిగ్రీ కోర్సులు కూడా చేయవచ్చని, వృత్తి విద్యా కోర్సులు జీవితంలో త్వరగా ఉద్యోగంలో స్థిరపడడానికి ఉపయోగపడుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేందర్, సీనియర్ అధ్యాపకులు ఉపేందర్, అధ్యాపక, అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.